వీలుంటే నా నాలుగు లంకెలు ...

Friday, November 13, 2009

ఆంధ్రభాషావికాసం

0 వ్యాఖ్యలు
తెలుగు భాషాప్రయుక్త రాష్ట్రానికి యాబది సంత్సరాలు నిండిన సందర్భముగా,ఆంధ్రభాషా(తెలుగు) ప్రాచుర్యంపై మా నాన్నగారు యాగాటి కనకారావు గారు 2005 సంవత్సరములో వ్రాసిన కవిత...

వేయి జిహ్వలు చాలవు నిను పొగడగ
భూమి భాషల మృదు మధుర ధ్వనుల
భారతీ ఒడిలోన మురిపెముల చిన్నారివై
తేనెలూరించు సొబగుల తెనుగు తల్లీ !


ప్రాచీన గీర్వాణ గంభీర పద బంధన
పౌరాణికేతిహాస భావనాడోల లూపిన
నన్నయాది కవి గురువుల కన్న తల్లీ
నీ సంస్కృతీ ప్రాభవాల న్నిల్పు తల్లీ !


ప్రబంధ కావ్య మదగజమన రీతుల
ప్రజాపతుల డోలలూగించి నీసౌందర్య
లహరినలరించి నీదు సంస్కృతీ నందనం
చాటిన పెద్దనాది కవులకన్న తల్లీవందనం!


నీకాటుక కంటినీరు జారు వార
విలవిలలాడి నీదు కన్నీరు తుడచి
ఓదార్చి నీ పవిత్ర ఆత్మగౌరవమ్ము
పోతనాది ప్రజా కవులకు జేజేలు !

నీదు చైతన్య స్ఫూర్తీ విజ్ణాన వీచికలు
నీతి సూత్ర ఆధునిక సంస్కరణలు
హేతు విజ్ణాన మాంధ్రుల దోచిటపోసిన
పరవస్తు కందుకూరి గురజాడలకు జోహార్లు !


పారతంత్ర్యము పారద్రోలి స్వాతంత్ర్యమ్ము
సాధించిన భరతమాత ముద్దు బిడ్డలు
పరభాషావ్యామోహాన భరత భాషల
అల క్ష్మిం చు నీదు బిడ్డల మేలుకొల్పు !


“దేశభాషలందు తెలుగులెస్స” ఘనకీర్తి
కాదు దశకోటి ఆంధ్రుల చిరకాలకోర్కె
నీదుపేర విశాలాంధ్ర కై ప్రణత్యాగమొనర్చి
భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధించిన ప్రజాకోటి
శ్రీరాముల గన్న తల్లీ నీకిదే వందనం !

ఆంధ్ర రాష్ట్రావతరణతో శ్వాస పీల్చి
ఆభ్యుదయ విప్లవ సాహిత్య ప్రక్రియలు
నీదు సామాన్య ప్రజల చైతన్య పరచిన
రాయప్రోలు దాశరధి ఆరుద్ర శ్రీశ్రీలకు జేజేలు!


శ్రీశ్రీ ఇత్యాది కవుల నీ సాహిత్య ప్రభావ

జనితా ప్రజ సాహిత్య పరవళ్ళఅతో
సమ సమాజ ధ్యేయ యువ కవితా
కిశోర్ల కన్న తెలుగు తల్లీ నీకిదే వందనం !


తెలుగు భాషా సంస్కృతి ప్రచార యాత్ర కొరకు

శుభాభినందనలతో

1942 - 2009
యాగాటి కనకారావు, ఏలూరు.

Friday, November 6, 2009

Wednesday, September 16, 2009

దేవుడనేవాడు నాకెదురుపడితే!!

11 వ్యాఖ్యలు

''ఓ దేవుడా! నువ్వు నన్ను డిపెం డెంటుగా సృష్టించావా? లేక ఇండిపెండెంటుగా సృష్టించావా? డిపెండెంటుగా ఐతే నేను చేసే పనులన్నిటికీ బాధ్యత నాదే. కనుక నేను సమాధానం చెప్పనక్కరలేదు. కాదూ, ఇండిపెం డెంటుగా సృష్టించానంటావూ! అలాగైతే నేను నీకు ఎందుకు సమాధానం చెప్పాలి? అని అడుగుతున్నాను.'' - అంటాడు గిరిశం కన్యాశుల్కం నాటకంలో. ఒక వికట హాస్య పాత్ర ధారి చేత ఈ డైలాగులు పలికించినా గురజాడ గిరీశం ద్వారా ఒక కీలకమైన ప్రశ్నను లేవ నెత్తాడు. దేవుడికీ, మనిషికీ సంబంధ ఏమిటన్నదే ఆ ప్రశ్న? భావవాదులు దేవుడే ప్రకృతిని సృష్టించాడని వాదిస్తారు. దాని నుంచి ఓ అడుగు ముందుకు పోయి దేవుని నిర్ణయాను సారమే అంతా జరుగుతుందని అని అంటారు. మరి ఆ దేవుడెలా వుంటాడు? ఎక్కడుంటాడు? ఉన్నా డని ఎలా చెప్పగలరు? అని అడిగితే దేవుడు ఆదిమధ్యాంత రహతుడని, సర్వశక్తి మంతుడని, నిరాకారుడు, నిర్గుణుడు అని సమాధానం చెప్తారు. ఏ ఆకారమూ లేని, ఏ లక్షణమూలేని దేవుడిని ఉన్నాడని ఎలా చెప్పగలరు? ఉన్నట్టు తెలుసుకోవటం ఏలా? ''ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు'' అని ప్రహ్లాదుడిచేత పోతన పలికిస్తాడు భాగవతంలో. వెదకి చూసినపుడు కంటికి కనపడాలంటే ఆకారం ఉండాలి. మరి దేవుడు నిరాకారుడన్నాడు కదా! ఎలా చూడటం? పోనీ ఆకారంలేకుంటేనే ఏ లక్షణమైనా ఉంటే తెలుసుకోవచ్చు. గాలికి ఆకారం లేదు గాని మన చర్మానికి తెలుస్తుంది గాలి ఉన్నట్టు. విద్యుత్తుకి ఆకారంలేదు కాని టెస్టర్‌ ప్లగ్గులో పెడితే కరెంటు ఉన్నదీ పోయినదీ తెలుస్తుంది. అలా దేవుడి గురించి తెలియాలంటే ఏదో లక్షణం ఉండాలి గదా. ఏ లక్షణమూలేక, ఏ గుణమూలేక, ఏ ఆకారమూ లేక - ఇక ఉన్నట్లు భావించడమెలా? ఉన్నాడన్న విషయాన్ని నిర్ధారించలేని పరిస్థితి ఉన్నపుడు ఇక ఆ దేవుడికీ, మనిషికీ సంబంధం ఏమిటి?

దేవుడే ప్రపంచాన్ని సృష్టించాడు అన్న వాదాన్ని చీల్చి చెండాడిన వారిలో పెద్దపీట వేయాల్సినది సాంఖ్యులకు. సాంఖ్యవాదాన్ని అతి ప్రాచీనమైనదిగా చరిత్ర కారులు గుర్తిం చారు. ఉపనిషత్తుల కాలానికి ముందే సాంఖ్యం ఉనికిలోకి వచ్చింది. బౌద్ధం క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలం నాటిది. దానికి ముందే సాంఖ్య వాదం ఉంది. అంటే నేటికి సుమారు 2700 సంవత్సరాల క్రితమే సాంఖ్యవాదం ప్రాచుర్యం లో ఉందన్నమాట. ఈ సాంఖ్యాన్ని తొలుత ప్రతిపాదించిన వాడు కపిలుడు. ఉపనిషత్తులలో (భాందోగ్యోపనిషత్‌, కఠోపనిషత్‌, శ్వేతాశ్వతా రోపనిషత్‌, వగైరాలలో) మహాభారతంలో, భగవద్గీతలో సాంఖ్యం గురించిన ప్రస్తావనలు, చర్యలు ఉన్నాయి. ఉపనిషత్తుల కాలంనుంచి శంకరుని వరకూ గల భావవాదులందరూ సాంఖ్యా వాదాన్ని ఖండించటానికి ఎంతో ప్రధా న్యత నిచ్చారు. దానిని బట్టి సాంఖ్యం ఆనాటికి చాలా శక్తివంతమైన భౌతికవాదంగా ప్రాచుర్యం పొందినట్టు తేలుతోంది.

సాంఖ్యులు ప్రతిపాదించిన వాదాన్ని స్వభావ వాదం అంటారు. ప్రకృతి అనాదిగా ఉన్నది. ఈ ప్రకృతికి స్వతహాగా ఉన్న స్వభావం వల్లనే నిరంతరం మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులలో భాగంగానే ప్రస్తుతం ఉన్న ప్రపంచం ఏర్పడింది. ఇందులో దేవుని ప్రసక్తే లేదు. ఆవు గడ్డితిని నీరు తాగుతుంది. అది దాని స్వభావం. అదే సమయంలో దాని శరీర స్వభావం వలన పొదుగులో పాలు ఏర్పడ తాయి. అవుదూడ ఆ పాలను తాగుతుంది. ఇదే విధంగా ప్రకృతి స్వభావం వల్లనే ఈ ప్రపంచం ఏర్పడింది. ఎగువ నుంచి పల్లానికి ప్రవహించడం నీటి స్వభావం. ఆ నీటికి ఎటువంటి చైతన్యమూ లేదు. కాని నీరు మానవులకి ఉపయోగపడుతుంది. చెట్లు, చేమలు నీటిపై ఆధారపడి బతుకుతాయి. నీటికున్న స్వభావం రీత్యానే ఇదంతా జరుగుతోంది. తప్ప వేరే ఇరత కారణం (దేవుడు) ఏదీలేదు.

దేవుడే సృష్టికి కారణమన్న ఈశ్వర వాదాన్ని సాంఖ్యం తత్తునియలు చేసింది. దేవుడికి ఏగుణమూ లేదని మీరంటారు. ఏ గుణమూలేని దాని నుంచి గుణాలున్న ప్రపంచం ఎలా వచ్చింది? తెల్లదారంతో వస్త్రంచేస్తే తెలుపు రంగు గల వస్త్రం వస్తుంది. అదే నల్లదారం తోనైతే నలుపు వస్త్రం తయారౌతుంది. దారం రంగుని బట్టి వస్త్రం రంగు నిర్ణయించబడినట్టే ప్రపంచంలోకి వస్తువుల గుణాలు అది దేని నుంచి ఉద్భవించాయో దాని గుణాల నుండే సంక్రమిస్తాయి. ఒక వేళ దేవుడి నుండే ప్రపం చం ఏర్పడితే ఈ ప్రపంచానికున్న గుణాలన్నీ ఆ దేవుడి నుండి సంక్రమించినవేగదా. అంటే దేవుడికి గుణాలు ఉన్నట్టే గదా? దేవుడు నిర్గుణుడు అని మీరు చెప్పింది తప్పు అని తెలింది గదా!... ఈ విధంగా ఈశ్వర వాదు లను సాంఖ్యం తన తర్కంతో ఎదుర్కొన్నది. ఈ ప్రపంచం పదార్ధమయం. పదార్ధానికి గుణాలుంటాయి. ప్రపంచాన్ని సృష్టించాడని మీరు చెబుతున్న దేవుడు నిర్గుణుడు. అంటే పదార్థరహితం. మూలకారణం పదార్ధరహితం అయితే అందులోనుంచి వచ్చిన ప్రపంచం కూడా పదార్ధరహితంగానే ఉండలి గదా. పదార్ధ రహితమైన దైవం నుంచి పదార్ధమయమైన ప్రపంచం ఎలా వస్తుంది? కార్యానికీ కారణానికీ మధ్య మూలకంగా ఉమ్మడిలక్షణం ఉండాలి. కారణంగా మీరు చెప్పే దేవుడికీ, కార్యంగా ఏర్పడిన ప్రపంచానికీ ఆ ఉమ్మడి లక్షణం ఏది? కనుక దేవుడు సృష్టికి మూల కారణం కాలేడు. తాను చెప్పిన దానిలోనే ఒకదానికొకటి పొసగకపోతే దానిని తర్కంలో స్వచోవ్యాఘాతం అంటారు. ఈశ్వరవాదం అంతా స్వవచోవ్యా ఘాతమేనని సాంఖ్యం రుజువు చేసింది.

దేవుడు సృష్టికర్తే అయితే ఎందుకోసం సృష్టించాడు? తన ఆనందం కొరకా? తన ఆనందం కోసం చేసేవాడు స్వార్ధపరుడు. దేవుడిని స్వార్ధపరుడు అని ఒప్పుకుంటారా? ఒప్పుకోలేరు. కనుక దేవుడు దయతో సృష్టించివుండాలి. ఎవరిపైన ఈ దయ? నిర్జీవ పదార్దాలపై దయ అంటే అర్ధంలేదు. సజీవ పదార్ధాలపై దయ అంటారా? అలాంటి దయ కలగాలంటే ముందు సజీవ పదార్ధాలు ఉండలిగదా? జీవపదార్ధాన్ని సృష్టించాక దయ కలిగిందా లేక దయ కలిగి సృష్టించాడా? ఏది ముందు? జీవాన్ని సృష్టించ కుండానే దయ ఎలా కలిగింది?

పోనీ, దయ ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు కలిగింది అనుకుందాం. ఈ దయ ఎందుకోసం? జీవుల బాధలు తొలగించ డానికా? అసలు బాధలు ఎందుకొచ్చాయి? బాధలుండాలంటే శరీరం ఉండాలి. దానిని దేవుడు ముందు సృష్టించాలి. అంటే దేవుడు బాధలకు నిలయమైన శరీరాన్ని సృష్టించా డన్నమాట. అంటే బాధలకు మూలకారణం దేవుడే అన్నమాట. దీనికి ఈశ్వర వాదులు అంగీకరిస్తారా?

ముందు దేవుడు శరీరం సృష్టిస్తే అప్పుడు బాధలు కలిగాయి. బాధలను తొలగిం చాలనే దయ దేవుడికి కలిగింది. అని అను కుంటే అసలు సృష్టికి మునుపు బాధలు కలిగే ఆస్కారం లేదు అని అర్ధం అవుతుంది. అప్పుడు దయ కలగాల్సిన అవసరం లేదు. అటువం టప్పుడు సృష్టి చేయాల్సిన అవసరమే లేదు.

అబ్బెబ్బే, అలాకాదు, సృష్టి తర్వాతనే దేవుడు దయామయుడైనాడని అంటారా? అంటే ముందు ప్రాణులను సృష్టించి, వారికి బాధలు కలిగించి ఆ తర్వాత దయతో ఆ బాధలను తొలగించేందుకు దేవుడు పూనుకున్నాడని ఒప్పుకుంటారా?

ఈశ్వరవాదులు తాము చెప్పిన దానిలో దేనినీ తామే ఒప్పుకోజాలని ఇరకాటం లో పడిపోయేంతగా సాంఖ్యం తన తార్కిక వాదనలను ప్రతిభావంతంగా ప్రయోగించింది. ఇంత ప్రతిభావంతమైన ప్రాచీనమైన సాంఖ్యం తర్వాతకాలంలో బలహీనపడింది. క్రీస్తుపూర్వం నాటి సాంఖ్యవాదానికి సంబంధించి క్రీస్తుశకం 11వ శతాబ్దానికి చెందిన ఈశ్వర కృష్ణ రచించిన 'సాంఖ్య కారిక' 14వ శతాబ్దం నాటికి చెందిన సాంఖ్య సూత్రాలు మాత్రమే లభ్యమౌ తున్నాయి. ఈశ్వర కృష్ణ ఆస్తికుడు. అతడు రచించాడన్న దానినిబట్టి సాంఖ్యం యొక్క మూలసిద్ధాంతం ఎంతగా పలుచనై పోయి వుంటుందో ఎంతగా వక్రీకరించే అవకాశం వుందో ఊహించుకోవచ్చు. సాంఖ్య సూత్రాలు కూడా ఆ విధంగా రూపొందినవే.

ఈశ్వరవాదాన్ని చెండాడడంపై కేంద్రీకరించినంతగా సాంఖ్యం సమాజంలోని వర్గ వైరుధ్యాలపై దృష్టి సారించలేదు. లోకాయతానికి, సాంఖ్యానికి ఇదే ప్రధానమైన తేడా. అందుకు భావవాద తత్వవేత్తలు లోకాయతాన్ని శత్రుపూరిత దోరణితో నాశనం చేస్తే కపిలుడికి అమితమైన గౌరవం ఇచ్చారు. దేవుడి అవతారం అని అభివర్ణించారు. అదే సమ యంలో సాంఖ్యం యొక్క ఆయువు పట్టయిన స్వభావ వాదాన్ని నామమాత్రంగా మిగిల్చి వుంచారు.

తర్వాత కాలంలో వేదాలను ప్రమా ణంగా సాంఖ్యులు అంగీకరించడంతో దాని ప్రగతిశీలత కనుమరుగైంది. పశ్చిమదేశాలలో భౌతిక వాదులందరిలోకి ప్రాచీనుడు హిరాక్లిటస్‌. ఇతడు క్రీ.పూ. 550-480 సంవత్సరాల మధ్య జీవించిన గ్రీకుతత్వవేత్త. అంతకన్న దాదాపు 400-500 సంత్సరాలకు మనుపే మనదేశంలో సాంఖ్యం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇదీ దీని చారిత్రక ప్రాధాన్యత.


... control C and control V from
ఎం.వి.ఎస్‌. శర్మ's article

Saturday, September 12, 2009

EVM పై ఈసీఐల్ వారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం

0 వ్యాఖ్యలు
నేను మరియ యింకొందరం కలసి మాకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఉన్న సందేహాలపై సుప్రీం కోర్టులో వేసిన ప్రజావాజ్యాన్ని మరియు మేము తయారు చేసిన ఈవియమ్ నకలు వలన ఈసీఐల్ వారి ప్రతిష్ఠదిగజారినదని మాకు ఈసీఐల్ వారు లీగల్ నోటీస్ జారీ చేసారు.

మాకు లీగల్ నోటీస్ జారీ చేయడమంటే, సుప్రీం కోర్టు మరియు ఎన్నికల సంఘం యొక్క విధులలో ఈసీఐల్ వారు తలదూర్చడమే అవుతుంది. ఎందుకంటే, మేము మెరుగైన ప్రజాస్వామ్యానికొఱకు సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎన్నికల సంఘం వారు ఎవరి యంత్రాలు వాడారు, యంత్రాలు తయారు చేసినవారి లాభనష్టాలతో మనకి సంబంధం ఏముంది? మాకు కావలసినది మాత్రం యంత్రాలను నమ్మవచ్చా? లేదా? ఏమైనా లొసుగులు వున్నాయా? వీటికి సమాధానము చెప్పవలసిన అవసరం కేవలం ఎన్నికల సంఘానిదే. దీనిలో ఈసీఐల్ వారికి సంబందం లేదు. ఎదుకంటే, ఎన్నికల సంఘం స్వతంత్ర్య నిర్ణయాత్మక సంస్థ. అంతేకాకుండా, ఎన్నికల నిర్వహణలో భారత రాజ్యాంగములోని పౌర చట్టము ప్రకారము ఎన్నికల సంస్థకు అన్ని హక్కులు కల్పంచబడ్డాయి. అంటే, ఈవీయమ్ లు, వాటి సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ పై ఎన్నికల సంఘానికి సంపూర్ణ హక్కులు కలిగి వుండాలి.

పై విషయాలను, కేంద్ర ఎన్నికల సంఘానికి మేము తెలియజేసితిమి. తదుపరి వెనువెంటనే, మాకు జారీచేసిన లీగల్ నోటీసులను ఉపసంహరించుకోవలసినదిగా కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐల్ వారిని ఆదేశించినది . పూర్తి వివరాలు చదవండి...

మిరు టపాలు కూడా యిష్ట పడొచ్చు...
.ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ (EVM) విషయంపై నాకు లీగల్ నోటీస్
౨. ఈసీఐఎల్ వారి లీగల్ నోటీసుకు సమాధానం..
౩. ఓటింగ్ యంత్రాల పై కేంద్ర ఎన్నికల సంఘం తో చర్చల సారాంశం

ఓటింగ్ యంత్రాల పై కేంద్ర ఎన్నికల సంఘం తో చర్చల సారాంశం

1 వ్యాఖ్యలు
Venue : Nirvachan Sadan, New Delhi on 3rd Septemner, 2009
Agenda: Demonstration of Tamperability of EVM

Participants

Election Commission of India Representatives
Mr. Akshay Raut, Election Commission (EC)
Mr. J P. Prakash Election Commission (EC)
Mr. Alok shukla, Election Commission (EC)
Prof. P.V. Indiresan, Technical Experts Committee, EC
Prof. Sahani, Technical Experts Committee, EC
Prof. Agrawal, Technical Experts Committee, EC
ECIL & BEL Engineers, EC

Petitioners’ Representatives
Mr. V V Rao, Petitioner in writ petition (PIL) filed in the Hon’ble Supreme Court
Mr. Arun Kumar, Petitioner in writ petition (PIL) filed in the Hon’ble Supreme Court
Mr. Hari K Prasad, Managing Director, Netindia & Technical Expert
Mr. Subramanya Swamy, President, Janata Party & Former Union Law Minister
Mr. Jayant Das, Senior Advocate Supreme Court & Former Attorney General, Orissa
Mr. G.V.L. Narasimha Rao, Psephologist and Columnist
Mr. Roxena Swamy Senior Advocate, Supreme Court
Mr. Suresh, Technical Expert
Mr. P S V Prasad, Technical Expert


The meeting started at 3:30PM sharp. The meeting was conducted in the absence of the Election Commissioners who in the earlier meeting held on August 17 promised to be present in all meetings as the petitioners were directed by the Hon’ble Supreme Court and they had raised many important issues in their writ petition in the Hon’ble Supreme Court. Read more ...

Friday, August 28, 2009

ఈసీఐఎల్ వారి లీగల్ నోటీసుకు సమాధానం..

13 వ్యాఖ్యలు
Please read previous blog first..

నాకు EVM లో ఖచ్చితమైన సందేహాలు వున్నాయి. అవినాకు ఎవరిదగ్గరకు వెళ్ళినా తీర్చటం లేదు. అవి ఈ క్రిందవిధముగా వున్నాయి...

1. Violating the Indian Democracy fundamental rule “Secrecy of Vote”.


2. In simultaneous polling(Assemble and Parliament), If by mistake/intentionally the connecting cables are swapped between control units of AC and PC the EVMs shall not indicate link error.


3. There is no existing mechanism to detect a willful Trojan inside the chip or to authenticate the code inside the chip is original. Assume If Microprocessor Chip is been cloned (at chip manufacturer / vendor / transit)? My straight question here, Can ECIL proves that, internal image of EVM doesn’t match with ECIL Code?


4. How to identify whether EVM is genuine or cloned by Candidate/Polling Officer/Agent?


నేను పై సందేహాలు వెళ్ళబుచడమే కాకుండ, వాటిని ప్రస్తుత EVM లో ఎటువంటి మార్పులు చేసి EVM పనితీరు మెరుగు పరచవచ్చొ కూలంకుషంగా విశదీకరించడమైనది.
My stand
1. I am not opposing to EVM system. I strongly oppose for Ballot/Paper voting

2. Present EVM technology is Perfect

3. I am not blaming any one of EVM developer or Manufacturers (BEL / ECIL).

4. Not comparable with America or European counties EVM systems. There are completely different. Ours is standalone.


5. Just we found some gray area in process of EVM (this is not part of ECIL process). Take advantage some people in future. That’s way I am asking to strengthen more present EVM.


నా పూర్తి పాఠం కోసం ఈ లంకె నొక్కండి Reply_To_ECIL.DOC
My Writ Petition at Supreme Court: Writ Petition.DOC

Legal notice issued by ECIL to me ECIL_Legal_Notice.PDF

Thursday, August 27, 2009

ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ (EVM) విషయంపై నాకు లీగల్ నోటీస్

12 వ్యాఖ్యలు
లోగడ, ప్రస్తుత ఎలక్ట్రాని క్ వోటింగ్ మిషన్ (EVM) పనితీరు మెరుగు పరచాలని, లొసుగులు లేకుండా చెయ్యలని, సుప్రీం కోర్టులో ప్రజావాజ్యం(Public Interest Litigation) వేసియున్నాను. సుప్రీం కోర్టు మా పరిదికాదు, ఎలక్షన్ కమీషన్ వారిని సంప్రదించండి అని కేసును కొట్టివేయడం జరిగింది. దానికి ప్రతిఫలంగా, కేంద్ర ఎలక్షన్ కమీషన్ సెంప్టెంబర్ ౩, 2009 న వారి ఆఫీసికి (EVM) పై చర్చించుటకు ఆహ్వానించింది.
విచిత్రమేమిటంటె, ఇసీఐల్ వారు నాకు లీగల్ నోటీసు పంపించారు. వారి ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ (EVM) వ్యాపారము నా చర్య వల్ల దెబ్బతింటుందట! ఆంటే, భారత ప్రజాస్వామ్య ఎన్నికలు వారి దృష్ఠిలో వ్యాపారము అన్నమాట.

Sunday, August 9, 2009

పురాణగ్రంథాలు కథలైతే రామసేతు మాటేమిటి?

11 వ్యాఖ్యలు
పురాణ గ్రంథాలన్నీ కథలేనని, వాస్తవ చరిత్రలు కావని నాస్తికులు, హేతువాదులు అంటున్నారు. మరి భారత భూభాగానికి, శ్రీలంకకు మధ్య ఉన్న రామసేతు మాటేమిటి? ఆ ఆనకట్టలోని రాళ్లు నీటిపైన తేలాడుతున్నాయి. దీనికి వారేమంటారు?
- ఓ బ్లాగరి ప్రశ్న.

ప్రొ|| ఎ. రామచంద్రయ్య గారి సమాధానం...
ప్రజల విశ్వాసాలను మనమందరం గౌరవించాలి. వారి వారి ఆలోచనా ధోరణుల్ని వారి విచక్షణకు వదిలేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రథమధర్మం. అలాగే ఒకరి విశ్వాసాలు మరొకరి విశ్వాసాలకన్నా గొప్పవని అనుకోవడం కూడా సబబు కాదు. మతప్రసక్తి లేని లౌకికరాజ్యం మనది. అయితే వ్యక్తులు తమ నమ్మకాలను, విశ్వాసాలను వాస్తవాలుగా ప్రచారం చేసుకోవాలంటే వారు ఋజువులు చూపడానికి కూడా సిద్ధపడాలి. 'నేను మహా గొప్పవాణ్ణి' అని నేననుకున్నంతవరకూ ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ 'నేనే మహా గొప్పవాణ్ణి' అని వీధుల్లోకి వచ్చి కనిపించినవారికల్లా బడాయిపోతున్నారనుకోండి. అప్పుడు ఆసక్తి కలిగిన అమ్మాయో.. అబ్బాయో.. పెద్దో.. చిన్నో.. ఎవరైనా 'నీ గొప్పతనమేంటో ప్రదర్శించు చూద్దాం' అని అడిగే హక్కు ఉంటుంది. అలాగే ఆ గొప్పతనం ఏమిటో ప్రదర్శించాల్సిన బాధ్యత కూడా నామీద ఉంటుంది. భారత, రామాయణం, ఖురాన్‌, బైబిల్‌ వంటి గ్రంథాలు చాలా గొప్పవి. అవి చదువుతుంటే ఎంతో ఆసక్తి, సంభ్రమం కలుగుతాయి. అద్భుత కావ్యాలుగా మనకు అనిపిస్తాయి. ఎందుకంటే అవి వేలాది సంవత్సరాలుగా ప్రజల జీవనవిధానాల్లో ఇమిడిపోయాయి. కళా దృక్పథం, వాంఙ్మయ సామర్థ్యం ఉన్న మహనీయులు ఎందరో ఈ గ్రంథాలను మరింత పరిపుష్టి చేశారు. పురాణగ్రంథాల్లో ఉన్న ప్రముఖవ్యక్తులు ఇక్కడ అదృశ్యమై అక్కడ ప్రత్యక్షమవుతారనీ, ఇంకా మరేవో మహత్తులు వారికి ఉన్నాయని ఆయా గ్రంథాల పాఠకులు వారిలో వారే అనుకుంటే అది వారి ఇష్టం. కానీ వారు సమాజం మధ్యలోకి వచ్చి ఇలాంటి కల్పనలు వాస్తవాలని వాదిస్తే.. 'అలా ఏ వ్యక్తీ అదృశ్యమై తిరిగి ప్రత్యక్షమైన దాఖలాలు ఎక్కడా ఎప్పుడూ ఎవరూ చేయలేరని' వాదించే హక్కు ఇతరులకు ఉంటుంది. 'కేవలం వినడం వరకే నీ పని, ప్రశ్నించే హక్కు నీకు లేదు' అని ఎవరైనా అంటే అది న్యాయం కాదు. చిటికెన వేలితో పెద్ద పర్వతాన్ని నిలబెట్టగల శక్తివంతుడు, అరచేతిలోంచి అదే పనిగా తానులకొద్దీ చీరలను కుళాయిలో నీళ్లులాగా తీసుకురాగల మహిమాన్వితుడు మానవ చరిత్రలో ఎక్కడా లేడు. మానవుడు ఈ భూమ్మీద పుట్టి ఇప్పటికి సుమారు 20 లక్షల సంవత్సరాలైనా రాత ప్రతుల ద్వారా సమాచారాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందజేసే సంఙ్మాయుత (coded communication) వ్యవస్థకు పదివేల సంవత్సరాలకు మించిన చరిత్ర లేదు. మానవులు సమూహాలుగా ఏర్పడి పాలకులు, పాలితులుగా మారిన రాజ్యవ్యవస్థ ఏర్పడి లక్ష సంవత్సరాలు కూడా కాలేదు. అంతకన్నా ముందు ఈ భూమిపై మానవులు సంచరించిన పద్ధతులు, ఆహారపు సేకరణ విధానాలు, కుటుంబవ్యవస్థ, ఉత్పత్తి సంబంధాలు, కళలు వంటి విషయాలు (నాగరికత) పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డాయి. వీటిని ఆధునిక శాస్త్రీయ పద్ధతులు ఆధారంగా రూపురేఖలు, వయస్సును తెలుసుకోగలుగుతున్నాం. ఆరీత్యా చూస్తే మానవసమాజంలో యుగాలు ఉన్నట్లు, ఒక్కో యుగంలో ఎవరో అవతార పురుషుడు వచ్చి సమస్త ప్రపంచాన్ని అద్భుత మహత్తులతో పాలించినట్లు ఎటువంటి ఆధారాలూ లేవు. రామాయణంలోని వ్యక్తులు, భారతంలోని వ్యక్తులు, భాగవతంలోని పాత్రలూ, బైబిల్‌, ఖురాన్‌ వంటి మతగ్రంథాల్లో ఉటంకించిన వ్యక్తులూ చరిత్రలో ఏమాత్రం లేరని మనం చెప్పలేము. ఆయా కాలాల్లో గొప్ప సమర్థులైన వీరులు, అందమైన స్త్రీలు, క్రూర బుద్ధులు ఉన్న మనుషులు ఇప్పటిలానే అప్పుడూ ఉండేవారు. మంచి, చెడుల మధ్య పోరాటం ఆయా కాల మాన పరిస్థితులు నిర్ధారించిన ధర్మాధర్మాల మధ్య ఘర్షణ, భూమి, నీరు, నివాసం వంటి ప్రకృతి వనరుల కోసం యుద్ధాలు జరిగాయి. సమాజంలో ఉన్న చెడును గుర్తించి దాన్ని నివారించడానికి ఉపదేశాలను చేసిన వారు కూడా ఉండేవారు. అటువంటి మహనీయులు మానవ సమాజానికి ఎంతో కొంత మార్గదర్శకత్వాన్ని చేకూర్చారు. అయితే చిరంజీవులుగా ఉండేవారు ఎవరూ లేరు 'జాత్యస్యః మరణం ధృవం' అన్నట్లే కౌసల్యకు జన్మించిన రాముడు, అంజనీపుత్రుడైన ఆంజనేయుడు, మేరీ మాతకు జన్మించిన ఏసుక్రీస్తు, దేవకీదేవికి జన్మించిన కృష్ణుడు ఇలా ఎవరైనా వారికి కూడా ఆ నియమం వర్తిస్తుంది. అయితే, క్రమేపీ అలాంటి మంచివారిని, వీరులను, సమర్ధవంతమైన పాలకులను స్మరించుకునే సందర్భాలలో చరిత్ర గతిలో వారికి ఉన్న శక్తులకు మించి అధికశక్తులను ఆపాదించారు. మానవతీతు లుగా వారిని మలిచారు. ఆ పేరు చెప్పి ప్రజల్లోకి వారి అంశాలు, దైౖవాంశ సంభూతులం మేమే అంటూ పాలకులు ప్రజల్లో ప్రశ్నించకూడని విశ్వాసాలను నింపారు. మతభావాలను నాటారు. వాటిని యథాశక్తి పోషించారు, పోషిస్తున్నారు.

భూమ్మీద సహజంగా దొరికే ఏ రాయికైనా నీటి సాంద్రత (density) కన్నా ఎక్కువ సాంద్రత ఉంటుంది. కేవలం అగ్నిపర్వతాల నుంచి జాలువారే లావా ఎండిపోతే ఏర్పడే రాళ్లకు మాత్రమే నీటికన్నా తక్కువ సాంద్రత ఉంటుంది. భూమిలోపల అరుదుగా లభించే కొన్ని జియోలైట్లకు కూడా కొంతలో కొంత ఈ ధర్మం ఉంది. కృత్రిమ పద్ధతుల ద్వారా కూడా నేడు నీటికన్నా తక్కువ సాంద్రతగల కఠినమైన ప్రత్యేక కంపోజిట్లను తయారుచేస్తున్నారు. ఒక వస్తువు సాంద్రత నీటి సాంద్రతకన్నా తక్కువ ఉంటే ఆ వస్తువు నీటిపై తేలుతుంది. ఎక్కువగా ఉంటే అది మునుగుతుంది. సమానంగా ఉంటే నీటి మధ్యలో తేలకుండా, మునగకుండా ఉంటుంది. ఈ విషయాల్ని మీరు మీ సైన్స్‌ పాఠాల్లో (ప్లవన సూత్రాలు అనే శీర్షిక కింద) చదువుకునే ఉంటారు. మీరన్న రామసేతు నిర్మాణంలో సముద్రపు నీటిమీద తేలియాడే రాళ్లను వాడినట్లు అర్థం చేసుకోవాలి. కానీ తమాషా ఏమిటంటే రామాయణ గ్రంథం ప్రకారం అవి మునిగే రాళ్లేనని ఒక వానర నాయకుడు వాటిని చేత్తో స్పృశించగానే అవి నీటిపై తేలియాడే లక్షణాలను సంతరించుకున్నాయని చెపుతారు. అలాంటి ధర్మాలున్న రాళ్లు చరిత్రలో ఎక్కడా లేవు. అలాంటి ఊహలు కేవలం కథల్లో మాత్రమే సాధ్యం. ఇప్పుడు రామసేతు అనే పేరుతో ఉన్న భూభాగం సముద్రం అడుగున ఉంది. అది నీటిపైన తేలియాడుతూ లేదు. భారత భూభాగానికి, శ్రీలంకకూ మధ్య తక్కువ ఎత్తుగల పర్వతశ్రేణి అది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సంభవించిన ఖండాంతర చలనం (continental drift) వల్ల భూభాగాలు విడివిడిగా చీలి సముద్రజలాల మధ్య ద్వీపాలుగా, ద్వీపకల్పాలుగా ఉంటున్నాయి. అలాంటి ఖండాంతర చలనంలో శ్రీలంక భూభా గం భారత భూభాగం నుండి విడివడినప్పుడు ఏర్పడిన పర్వతశ్రేణే ఈ రామసేతు. కాబట్టి ఈ రామసేతు ఓ ప్రకృతిసిద్ధమైన సహజ నిర్మాణ మేనని, ఎవరో పనిగట్టుకొని నిర్మించిన వారధి కాదని భూగర్భ పరిశో ధనలు తిరుగులేని సాక్ష్యాలతో ఋజువు చేశాయి. మహత్తులున్న వ్యక్తులు చరిత్రలో లేరని, కేవలం కథల్లో మాత్రమే ఉండగలరని మనం భావించినప్పుడు పురాణగ్రంథాలను కథలుగా మాత్రమే చూడగలుగుతాం.

 • Bookmark and Shareవిజ్ఞానశాస్త్రంపై మతదాడి-3

4 వ్యాఖ్యలు

ఖగోళ శాస్త్రజ్ఞుడు బ్రహ్మగుప్తుని రచన ''బ్రహ్మ సిద్ధాంతాన్ని'' పరిశీలిద్దాం. ఈయన గ్రహణాన్ని గూర్చి తన గ్రంథం మొదట్లో ఇలా రాశాడు. కొంతమంది గ్రహణానికి రాహువు శిరస్సు కారణం కాదని భావిస్తారు. ఇది చాలా బుద్ధిలేని ఆలోచన. ఎందుకంటే రాహువే గ్రహణానికి కారణం. రాహువు శిరస్సు వల్ల గ్రహణం కలగకపోతే బ్రాహ్మణులు పాటించే పూజలు మొదలైన ఆచారాలు భ్రమలు కావాలి. ప్రజలు ఈ ప్రసిద్ధ ఆచారాలను అనుసరిస్తున్నారు. కాబట్టి వరాహమిహిరుడు అను రచయితలు ప్రజాభిప్రాయాన్ని వ్యతిరేకించడం మానుకోవాలి.'' గ్రంథం మొదట్లో ఈ భావనను వెలువరించిన రచయిత, కొన్ని అధ్యయనాల తర్వాత గ్రహణానికి కారణం 'సూర్య-చంద్ర-భూమి' సిద్ధాంతాన్ని ప్రవచిస్తాడు. చంద్రుని వ్యాసార్థాన్ని, భూమి నీడ వ్యాసార్థాన్ని లెక్కగడతాడు. ఇలా పరస్పర విరుద్ధ భావాలను రచయిత ఒకే గ్రంథంలో ఎందుకు ప్రకటించాడు? దీని కారణాన్ని 11వ శతాబ్దానికి చెందిన మధ్య ఆసియా యాత్రికుడు 'ఆల్‌ బెరూనీ' ఇలా ఊహిస్తాడు. ''బ్రహ్మగుప్తుడు గ్రహణాల విషయంలో పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వెలువరించడానికి కారణం అతని భద్రతకు ఉన్న ప్రమాదమే అయి ఉంటుందని నా విశ్వాసం. అతని విజ్ఞానం, బుద్ధి కుశలత, నిండు యవ్వనం ఆ ప్రమాదం ముందు ఎందుకూ పనిరాకుండా పోయాయి. బ్రహ్మ సిద్ధాంతం రాసేనాటికి అతని వయస్సు 30 సంవత్సరాలే.'' బ్రహ్మగుప్తుడు ఒకే గ్రంథంలో పరస్పర విరుద్ధ అభిప్రాయాలను వెలువరించడానికి ఆల్‌బెరూనీ పేర్కొన్నట్లు నిండు యవ్వనంలో ఉన్న అతనిపై మతనాయకులు వత్తిడి కాకుండా, వేరే కారణాన్ని ఊహించగలమా?' మరో ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహిరుడు. ఖగోళశాస్త్రాలపై తాను రచించిన 'బృహత్‌ సంహిత' అనే గ్రంథంలో గ్రహణాల వంటి అంశాలను సూర్య-భూమి-చంద్ర సిద్ధాంతంతో వివరిస్తాడు. అయితే, దానిలో ఒక అధ్యాయం పూర్తిగా మతనాయకులు ప్రవచించే మూఢనమ్మకాల వివరణకే కేటాయిస్తాడు. దీనిలో పురుషాంగానికి, పిల్లల పుట్టుకకు ఉన్న సంబంధాన్ని వర్ణించలేని భాషలో అసహ్యాంగా రాస్తాడు (గృహసంహిత 68వ పేజీ). ఏమిటీ అశాస్త్రీయ, అశ్లీల రాతలు? మహా శాస్త్రవేత్త వరాహమిహిరుడు ఈ విషయాలను ఎందుకు రాయవలసి వచ్చింది? మత నాయకుల భావాలు అవి ఎంత అశాస్త్రీయమైనా, వాటిని చేర్చకపోతే తన గ్రంథం వెలుగుచూడని పరిస్థితేనా దీనికి కారణం? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ప్రాచీన కాలంలోనే కాదు.. నేడు కూడా మతోన్మాదులు శాస్త్ర విషయాల ప్రచారం అంటేనే భయపడిపోతున్నారు. దీనిని తీవ్రంగా అడ్డుకుంటున్నారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఉదాహరణకు: ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు పి.ఎం.భార్గవ 1975-77 మధ్య 'సైన్స్‌ పద్ధతి' అనే ఒక ఎగ్జిబిషన్‌ను తయారుచేశాడు. దాని ఆవిష్కరణ జరగక మునుపే వందలాది చిత్రాలను, పరిశోధనా పరికరాలతో కూడిన ఆ ఎగ్జిబిషన్‌ను కొందరు సంఘపరివార్‌ వాలంటీర్లు అతికొద్ది సమయంలో (1978 ఆగస్టులో) తరలించారు. ఆ విధంగా జాతీయస్థాయిలో ఈ ప్రదర్శనను అడ్డుకొన్నారు. ఫలితంగా, ఈ ప్రదర్శన ఆంధ్రప్రదేశ్‌కు తరలించబడింది. ఆ హడావిడిలో అత్యంత విలువైన అనేక సైన్స్‌ పరికరాలు ధ్వంసమయ్యాయి. (ఏంజెల్స్‌, డెవిల్స్‌ అండ్‌ సైన్స్‌-పి.ఎం.భార్గవ, చందనా చక్రవర్తి 155 నుండి 169వ పేజీ). విజ్ఞాన శాస్త్ర పద్ధతి అంటే మతోన్మాదులకు ఎంత భయమో ఇది తెలుపుతుంది.

Monday, August 3, 2009

విమాన కంపెనీల వాదములో నిజమెంత?

2 వ్యాఖ్యలు
వారేమీ వ్యాపారలావాదేవీల్లో అనుభవంలేని కుర్ర వ్యాపారవేత్తలు కాదు. ఇతర రంగాలలో లాభాలు పిండుకుంటూ కొత్తరంగాలకు విస్తరించి తమ సంపద సామ్రాజ్యాలను పెంచుకోవాలన్న బడావ్యక్తులు. వీరిలో చీప్‌లిక్కర్‌ నుంచి ఖరీదైన స్కాచ్‌వరకు అన్ని రకాల మద్యం తయారు చేసి విక్రయించే విజయమాల్య ఒకరైతే. విమాన టిక్కెట్లు అమ్మే ఏజన్సీతో జీవితాన్ని ప్రారంభించి ఏకంగా విమానకంపెనీకే అధిపతి అయిన నరేష్‌ గోయల్‌ మరొకరు. కింగ్‌ఫిషర్‌, జట్‌ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌, ఇండిగో,గోఎయిర్‌ కంపెనీల యజమానులతో కూడిన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఫెడరేషన్‌ ఇంధనం పన్ను, విమానాశ్రయాల వినియోగ రుసుములను తగ్గించకపోతే ఈనెల 18న ఒక రోజు సమ్మె చేస్తామని ప్రభుత్వానికి శ్రీముఖం జారీ చేసింది. ఇతర రంగాలలోని ప్రైవేటు కంపెనీలు ఉద్దీపన పేరుతో రాయితీలు పొందుతున్నపుడు తాము మాత్రం ఎందుకు వెనకపడాలని ఈ కంపెనీల యజమానులు ప్రభుత్వంపై బెదిరింపులు, వత్తిడికి పూనుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎలాంటి ఉద్దీపన పథకాన్ని ఆశించవద్దని, సమ్మె చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ హెచ్చరించారు. పెరిగిన ఇంధన ధరలతో వైమానికరంగం తీవ్రంగా గాయపడిందని, తాము దయా ధర్మాలు అడగటం లేదని పన్నులు, చార్జీలను హేతుబద్దం చేయాలని మాత్రమే కోరుతున్నామని కంపెనీల ప్రతినిధులు కింగ్‌ఫిషర్‌ విజరు మాల్య, జట్‌ ఎయిర్‌వేస్‌ నరేష్‌ గోయల్‌ అంటున్నారు. కావాలంటే మాకంపెనీల్లో ప్రభుత్వానికి వాటాలిస్తామని చెబుతున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో ధరలు తగ్గాయంటే అవి విమానఛార్జీలు మాత్రమే. విమానయాన రంగంలో ప్రైవేటు కంపెనీలకు అవకాశం ఇవ్వాలని వత్తిడి తెచ్చిన వ్యాపారవేత్తలు తీరా అనుమతించిన తరువాత ప్రభుత్వరంగ విమాన సంస్థను దెబ్బతీసేందుకు చేయని యత్నం లేదు. ప్రైవేటు కంపెనీలు ప్రయాణీకులను తమవైపు రాబట్టుకొనేందుకు పోటీబడి విమాన ఛార్జీలను తగ్గించాయి. ఛార్జీలు తీసుకొని ఇంధనఛార్జీలు, పన్నులను మాత్రమే వసూలు చేసి విమానాలకు ప్రయాణీకులను అలవాటుపడేట్లు చేశారు. ఐటి రంగంలో పనిచేసే అనేక మంది విమానం మినహా ఇతరంగా ప్రయాణించటం పరువు తక్కువగా భావించారు. దాన్ని ప్రైవేటు విమానకంపెనీలు సొమ్ము చేసుకున్నాయి. ఇప్పుడు ఐటి బుడగ పేలిపోవటంతో పాటు అనేక రంగాలపై ప్రపంచ ఆర్థిక మాంద్య ప్రభావం పడింది. విమానాలు ఎక్కేవారు తగ్గిపోయారు. కనుక తాము చార్జీలు పెంచకుండా, తమ లాభాలు తగ్గకుండా తమకు రాయితీలు కావాలని విమాన కంపెనీల యజమానులు వత్తిడి తెస్తున్నారు. సామాన్యులు ఎక్కే ఆర్‌టిసి బస్సులకు వినియోగించే డీజిల్‌, ఇటీవల విపరీతంగా పెరిగిన కందిపప్పు మీద పన్ను తగ్గించటానికి ససేమిరా అన్న ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ మిగతా రాష్ట్రాలతో పోటీబడి విమాన ఇంధనంపై పన్ను తగ్గించారు. అందువల్లనే సామాన్యులు వాడే పెట్రోలు లీటరు రు.50 అయితే విమానాల పెట్రోలు రు.36కే పోస్తున్నారు. అయినా ధర ఇంకా ఎక్కువగా ఉందని, మాదగ్గర వసూలు చేసిన అధిక సొమ్ముతో సామాన్యులకు కిరోసిన్‌ సబ్సిడీ ఇస్తున్నారని విమాన కంపెనీల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. మా కంపెనీలు లేకపోతే ప్రయాణీకుల డిమాండ్‌ను ఎలా తట్టుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. నాకోడి కూయకుండా ఎలా తెల్లవారుతుందో చూస్తామని వాదిస్తున్నట్లుంది. విమానాశ్రయాలు ప్రైవేటురంగంలో ఏర్పాటు చేయటం అనర్దదాయకం అని ప్రభుత్వరంగ విమాన సంస్థల సిబ్బంది ఆందోళన చేసినపుడు విజయమాల్య వంటి పెద్దలు ప్రైవేటు రంగానికే మద్దతుపలికారు. హైదరాబాదులోని ప్రైవేటు విమానాశ్రయంలో వసూలు చేస్తున్న వినియోగరుసుములను చూసి విమానాశ్రయం బాగానే ఉందిగానీ అక్కడ వసూలు చేసే రుసుముల్నే భరించలేం అని అనేక మంది గుండెలు బాదుకుంటున్నారు. తమకు దెబ్బతగలనంత వరకు వాటి గురించి నోరుమెదపని విమాన కంపెనీలు ఇప్పుడు తమకే ఆ సెగ తగలటంతో నానాయాగీ చేస్తున్నాయి. ప్రభుత్వం నియంత్రణ ధరల విధానానికి స్వస్తిపలకాలని చెప్పిన వారే ఇప్పుడు తమకు కావాల్సిన ఇంధనానికి దానిని వర్తింపచేయాలని, నిత్యావసర సరకుగా పరిగణించాలని కోరటం దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా ఉంది. వారి డిమాండ్‌ ఏవిధంగా చూసినా సమర్థనీయం కాదు. తమకు గిట్టుబాటుగాక పోతే ధరలు పెంచుకొనే స్వేచ్ఛవారికి ఎలాగూ ఉంది. తక్కువ మందే ఎక్కుతారనుకుంటే విమానాలు, ప్రయాణాల సంఖ్యను తగ్గించుకోవచ్చు. అంతే తప్ప విమానాలకు భారీ రాయతీలిచ్చి బడాబాబులను దర్జాగా తిప్పే శక్తి మన పన్ను చెల్లింపుదార్లకు లేదు, అలా రాయితీలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. విమాన ఇంధనం ధర లీటర్‌ 70 రూపాయలు ఉన్నపుడు మౌనంగా ఉన్న ప్రైవేటు కంపెనీలు ఇప్పుడు 36-45 రూపాయలకు తగ్గినపుడు ఆందోళన హెచ్చరిక చేయటం ఎందుకన్న ప్రశ్న అనేక మందిలో ఉదయిస్తోంది. ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వ విమాన సంస్థ నష్టాలపాలైంది. దానిని ఆదుకొనేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నది. కనుక పనిలో పనిగా తాము కూడా కొన్ని రాయితీలు సాధించుకోవాలని ప్రైవేటు కంపెనీలు పూనుకున్నాయి. మనిషికి రోగనిరోధక శక్తిలేనపుడు ఎన్నిటానిక్కులు ఇచ్చినా ఫలితం ఉండదు. అలాగే సమాజంలో కొనుగోలు శక్తి తగ్గినపుడు కంపెనీలకు ఉద్దీపన పథకాలు ఇచ్చి ప్రయోజనం లేదు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచకుండా కంపెనీలకు రాయితీలవ్వడం వల్ల జనానికి కలిగే లాభమేమీ లేదు. ప్రభుత్వరంగ సంస్థలను భిన్న దృష్టిలో చూడాలి. అవి ప్రజల ఆస్తులు.వాటికి లాభాలు వచ్చినపుడు జనానికి పంచాయి. అందువలన నష్టాలు వచ్చినపుడు వాటిని ఆదుకోవటం ప్రభుత్వ బాధ్యత. రాయితీలు తీసుకొని కంపెనీలను దివాలా తీయించి మదుపుదార్లను ముంచిన ప్రైవేటురంగ పెద్దలెందరో మన కళ్లముందున్నారు. అందువలన ప్రైవేటు విమానయాన కంపెనీలు తెచ్చే వత్తిళ్లకు ప్రభుత్వం లొంగనవసరం లేదు. వాటికి జనం సొమ్మును కట్టబెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు.

Thursday, July 30, 2009

విజ్ఞానశాస్త్రంపై మతదాడి-2

23 వ్యాఖ్యలు

చెరకుడు రోగాల కారణాలు, వాటి చికిత్స విషయంలో పరిశోధనా ఫలితాల నుండి విడివడి, పదార్థానికి సంబంధంలేని చికిత్సలను అంగీకరించడం వెనుక గల కారణాలు ఏమై ఉంటాయి? దీనికి కారణం.. మనకు స్మృతుల్లోనూ, పురాణాల్లోనూ దొరుకుతుంది. వృత్తిదారులను, పురాణ రచయితల వైద్యులకు శస్త్రచికిత్సా నిపుణులను తీవ్రంగా నిరసించడమే కాదు. వారికి సంఘ బహిష్కరణ కూడా విధించారు. ఈ సందర్బంలో కింది ప్రకటనలను పరిశీలించాలి. వృత్తిదారుల్లో అగ్రేశరులైన మనువు వైద్యుని గూర్చి ఏమంటారో చదవండి. ''వైద్యునికి ఇచ్చిన ఆహారం, వైద్యుని నుండి తీసుకున్న ఆహారం చీములాగా అసహ్యామైనది. అది రక్తంలాంటిది. అంటాడు మనువు (మనుస్మృతి 214 పేజీ). అంతేకాదు...''శూద్రులు, చర్మకారులు, దొంగలు, నేరస్థులు, వైద్యులు, శస్త్రచికిత్సా నిపుణులు, వ్యభిచారిణులు, శీలం లేని స్త్రీలు - వీరు అపవిత్రులు. వీరు ఏ మత కర్మల్లోనూ.. చివరకు అంత్యక్రియల్లోనూ పాల్గొనకూడదు (మనుస్మృతి 215వ పేజీ). అంటే వైద్యులు, శస్త్రచికిత్సా నిపుణులు ఎవరితో పోల్చదగ్గ వ్యక్తులు? దొంగలు, నేరస్తులతో సమానులని మనువు సెలవిచ్చి వారికి సంఘ బహిష్కరణ శిక్ష విధించాడు.

'మైత్రేయ ఉపనిషత్తు' పేర్కొన్న ధర్మ భ్రష్టుల జాబితాలో చేతిపనుల మీద జీవించేవారు, తిరుగుబోతులు, శూద్రులై కూడా చదువుకున్నవారు, నటులు, వ్యాధి నయం చేసేవారు ఉన్నారు.
ఇతర ఉపనిషత్తులు, మహాభారతం కూడా పై జాబితాను అంగీకరించాయి.
ఇంతకీ వైద్యులపై స్మృతికారులకు ఎందుకు ఇంత ద్వేషం? వ్యాధులతో గల కారణాల్ని పైన వివరించినవిధంగా పేర్కొనడమే. ''పూర్వ జన్మార్జితం పాపం.. వ్యాధిరూపేణ జాయితే'' (పూర్వ జన్మనలో మనం చేసిన పాపాలు ఈ జన్మలో వ్యాధులకు కారణాలవుతాయి. కానీ చెరకుడు వ్యాధికి కారణం పదార్థాలలోనే ఉందని, చికిత్స కూడా పదార్థాలపైనే ఆధారపడాలని చెప్పాడు. మరి స్మృతికారులకు కోపం రాదా? అందుకే వారు వైద్యులను దొంగలను, నేరస్థులతో సమానం చేసి, వారిని సంఘ బహిష్కరణ చేశారు. చివరకు, చెరకుడు నుండి సామాన్యుని వైద్యుని వరకూ గత జన్మలోని పాపలే రోగాలకు కారణం అని అంగీకరించిన తర్వాత మాత్రమే వైద్యుల చికిత్సకు అంగీకరించారు.
(మిగతా తదుపరి టపాలో )

Wednesday, July 29, 2009

Supreme Court ‘no’ for panel to study EVMs

0 వ్యాఖ్యలు

Date:29/07/2009, Legal Correspondent

New Delhi: The Supreme Court on Monday declined to entertain a public interest litigation petition for a direction to appoint an expert committee to go into the working of electronic voting machines (EVMs) and submit a report to the court.

A bench of Chief Justice K.G. Balakrishnan, Justice P. Sathasivam and Justice Cyriac Joseph, while dismissing the PIL, gave liberty to the petitioners to approach the Election Commission and said it was for the Commission to consider their plea.

When the CJI asked counsel Sanjay Parikh, appearing for the petitioners V. Venkateshwara Rao and V. Laxman Reddy, associated with the Election Watch,Hyderabad, and Arunkumar Kankipati and Yagati Vasavya, experts, to approach the Commission, counsel said representation was already made and the Commission had stated that EVMs were foolproof.

The CJI said: We cant give any direction to the Election Commission. It is for the Commission to discuss such matters with all political parties and take a decision. Justice Sathasivam told counsel: We are not under-estimating the concern[s] raised in the petition but we are only saying that these issues are to be addressed to the Election Commission.

Counsel then said petitioners should be given the liberty to move the court after the Commission passed the order. The CJI said that liberty was always there.

Mr. Parikh submitted that in several democracies of the world where EVMs were being used, there were opposition and challenges before the courts. On March 3, the German Supreme Court declared that EVMs were untrustworthy and unconstitutional. It observed: Deliberate programming errors in the software perpetrate electoral fraud by manipulating the software of EVMs. He said a committee could go into the working of the EVMs. The PIL said that the petitioners had analysed the election results in various constituencies conducted with the help of EVMs and found that there was something drastically wrong with them. The petitioners also referred to the Commissions letter that out of 13.78 lakh EVMs used in the recent parliamentary elections, 9.30 lakh EVMs were old and 4.48 lakh were new machines, suggesting that improvements had been made in the EVMs.

Tuesday, July 28, 2009

మైఖెల్‌ జాక్సన్‌ - కళ, కాసులు, మీడియా!

3 వ్యాఖ్యలు
మైఖెల్‌ జాక్సన్‌ మరణించి నెలరోజుల కావస్తున్నా మీడియాలో ఆయన గురించిన కథలు నిరంతరాయంగా వెలువడుతూనే వున్నాయి.ప్రపంచాన్ని ఉర్రూతలూపించిన కళా స్రష్ట ప్రతిభా పాటవాల కంటే ఆయన మరణానికి సంబంధించిన మిస్టరీపైన,వ్యక్తిగత జీవితంలో నీలి నీడలపైన ఈ కథనాలు సాగుతుండడం ఆశ్చర్యకరమేమీ కాదు. పెట్టుబడిదారీ వ్యాపార వ్యవస్థ సహజ స్వభావాన్నీ, ప్రత్యేకించి మీడియాలో వేళ్లూనుకున్న వికృత పోకడలనూ మరోసారి కళ్లకు కట్టే సందర్భమిది.ప్రపంచ పాప్‌ సామ్రాట్‌ మైకెల్‌ జాక్సన్‌ హఠాత్తుగా మరణించాడన్న వార్త పెద్ద సంచలనమే సృష్టించింది. కళాభిమానులందరినీ కదిలించి .ఓ కన్నీటి బొట్టు మౌనంగా జారిపోయేలా చేసింది. ఆయన ఆనారోగ్యంతోనూ అనేక సమస్యలు సంక్షోభాలతోనూ పోరాడుతున్నాడని తెలిసినా యాభై ఏళ్లకే కన్నుమూస్తాడని మాత్రం ఎవరూ అనుకోలేదు.అలాటి సమాచారం కూడా రాలేదు. తీరా అది జరిగిన తర్వాత అనేక ప్రశ్నలు సందేహాలూ తలెత్తడం సహజమే. ఎందుకంటే మైఖెల్‌ జాక్సన్‌ జీవితమూ కళా ప్రస్థానమూ కూడా ప్రపంచానికి పెద్ద వార్తలే. నలుపు తెలుపు మేళవించిన విశ్వ కళా సంచలనం ఆయన. తన చిటికెన వేలు కదిలిస్తే వేలం వెర్రిగా ఎగబడిన కోట్ల మంది సంగీతాభిమానులు ఒకవైపు.. ఆ ప్రతి కదలికనూ అక్షరాలా కోట్ల డాలర్లలోకి మార్చిన సామ్రాజ్యవాద ధనస్వామ్య సంస్కృతి మరోవైపు కళ్లముందు నిలుస్తాయి. వాటన్నిటినీ లోతుగా తర్కించడం ఇబ్బంది అనిపించినా ఆ వ్యక్తిత్వంలో పెనవేసకుపోయిన లక్షణాలివి. ఆయన అసాధారణ ప్రతిభ, కృషి ప్రప్రథమంగా స్మరించుకోవలసినవి. అవే లేకపోతే ప్రపంచం ఆయనను ఇంతగా ఆరాధించేది కాదు. ఇప్పుడు దేశ దేశాలలో కవులు,కళాభిమానులు అశ్రుతర్ఫణ చేసే వారు కాదు. అయితే ఈ ప్రపంచంపై రాజకీయ ఆర్థిక ఆధిపత్యం సాగిస్తున్న శక్తులే సాంస్కృతిక ఆధిపత్యమూ చలాయించడం కూడా ఆయన పేరు మార్మోగడానికి ఒక ప్రధాన కారణం. ఇక్కడ అసాధారణ జనాభిమానం గల మాస్‌ హీరోలూ, వారితో స్టెప్పులేయించే నృత్యదర్శకులూ ఆయనను తాము ఎలా అనుసరించిందీ ప్రకటిస్తున్నారు. ఆ అవసరం లేకుండానే రీప్లే చేస్తున్న ఆయన స్టెప్పులను చూసిన మామూలు ప్రేక్షకులు అవన్నీ తమకు చిరపరిచితమైనవని గమనించి మన వాళ్ల అనుకరణ శక్తికి నివ్వెరపోతున్నారు. తెరపైనే గాక జీవితంలోనూ ఆ పాప్‌ వరవడి ప్రపంచాన్ని అమితంగా ప్రభావితం చేసింది. చాలా ఛానళ్లలో డాన్సు పోటీల పేరిట పిల్లలతో కూడా పిచ్చి పిచ్చి గెంతులు వేయించడం,వాటిపై సుదీర్ఘ విశ్లేషణాత్మక వ్యాఖ్యానాలూ వినిపించడం చూస్తూనే వున్నాం. దీనంతటిలోనూ ఆయన ప్రభావం సుస్పష్టం.ఇంతగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఆయన ఆదాయం విలాస వైభవ జీవితం గురించిన కథలకు అంతేలేదు. నిజానికి ప్రజలకు కావలిసింది వారి కళ తప్ప ఖాతా పుస్తకాలు కాదు. కాని వ్యాపార వ్యవస్థలో క్రికెట్‌ ఆటగాడైనా కిక్కెక్కించే పాటగాడైనా రేటును బట్టే ప్రచారం. కళాకారుల ప్రసిద్ధికి ఇవన్నీ కొలబద్దలు కావడం కూడా మార్కెట్‌ సంసృతి విశ్వరూపానికి నిదర్శనం.

పాల్‌ రాబ్సన్‌ వంటి నల్లజాతి గాయకులు, మహమ్మదాలీ వంటి క్రీడాకారుల జీవితాలకు భిన్నమైన ధోరణి జాక్సన్‌ది. నల్లజాతి గుండెచప్పుడుగా మొదలైన మైఖెల్‌ దేహ వర్ణంతో సహా శ్వేతజాతి ఆధిపత్య సాంసృతిక ప్రతీకగా మారిపోవడం వెనక ఒక పెద్ద సామాజిక సందేశమే వుంది. చివరి దశలో ఆయన ఎదుర్కొన్నసమస్యలూ, సంక్షోభాలూ కూడా కళారంగంలో చొరబడిన కాలుష్యాన్ని పట్టి చూపిస్తాయి. దీనంతటికీ వ్యక్తిగతంగా ఆయన బాధ్యుడు కాదు. అయితే నమూనాగా నిల్చి పోయాడన్నది నిజం.పాశ్చాత్య దేశాల విశృంఖలత్వానికి జాక్సన్‌ ఒక ప్రతీక. దానికి తనే ప్రచారమిచ్చాడు.విపరీత ప్రచారమిచ్చే మీడియానే వికృత కథనాలను కూడా విస్త్రతంగా వ్యాపింప చేయడం ఈ సంసృతిలో భాగం. జాక్సన్‌ ప్రతి కదలికనూ వెంటాడి వేటాడి కథలల్లి కాసులు కురిపించుకోవడం ఇందుకు పరాకాష్ట.
జాక్సన్‌ జీవితంలోని అసహజత్వానికి ఈ అసహజ అవాంఛనీయ సంసృతికి చాలా సంబంధం వుంది. బాదాకరమైనా చెప్పుకోక తప్పని నిజమిది. చెవులు చిల్లులు పడే శబ్దాన్ని చేసే మెగాస్పీకర్లు కళ్లు మిరుమిట్లుగొల్పే విద్యుద్దీపాలు వేదికపై ఆయన విగ్రహాన్ని వైభవాన్ని అనేక రెట్లు పెంచి చూపించాయి. ఇదో కళాత్మక ప్యాకేజి తప్ప కేవలం కళ కాదు.సంగీతం నాట్యం కంటే సాంకేతిక ఇంద్రజాలానిదే ఇక్కడ ఆధిక్యత. పెప్సీ ఉత్పత్తులకైనా ప్రత్యేక సంచికల అమ్మకానికైనా ఆకర్షణగా జాక్సన్‌ అక్కరకు వచ్చాడు. కథల్లో దురాశకు ప్రతిరూపాలైన రాజుల్లాగా మరుగుదొడ్లను కూడా బంగారు తాపడం చేయించుకుని అదో ప్రచారం పొందాడు. ఇదంతా అయ్యాక నల్ల రంగును భరించడం కష్టమై పోతుంది. దాన్ని వదిలించుకోవాలి. అందుకే అత్యాధునిక శస్త్ర చికిత్స. దానికి మరేదో కారణం చెప్పినా ఈ ఆకర్షణ కోణం కాదనలేని సత్యం. అంటే మనం మనంగా మనిషి మనిషిగా మన్నన పొందడం కాదు. వేషము మార్చెను భాషను మార్చెను అసలు తానే మారెను అన్నట్టుగా మారిపోవడం! అయినా అతని ఆరాటం తీరలేదు. అలా తీరదు కూడా. మన దేశంలో కూడా డబ్బు వుంటే చాలు శరీరాన్నే మార్చుకోవచ్చన్న ప్రచారాలు మహా జోరై పోయాయి. మధ్య తరగతి మనుషులు కూడా ఈ మోజులో తమను తాము కోల్పోతున్నారు. జుట్టు తెల్లగా వుంటే మొహంపై మొటిమలు మొలిస్తే ముడుతలు వస్తే జీవితమే వృధా అన్నంత నిరాశ. దాన్ని పారదోలడానికి సౌందర్య చికిత్సలు, సాధనాలు! పాలిపోయిన మొహంతో ప్రాణం లేని బొమ్మలా జాక్సన్‌ ముంబాయిలో చేసిన విన్యాసాలను అప్పట్లొ జానీలివర్‌ అద్భుతంగా అనుకరించి హాస్యం చేశాడు.చనిపోయాక పదే పదే వేస్తున్న పాత క్లిప్పింగులలో నల్లవజ్రంలా వున్న జాక్సన్‌కూ ఆఖరి దశలో ఆయన పాలిపోయిన ప్రతిరూపానికి పోలికెక్కడీ అందుకే ఆయన విఖ్యాతిలోనూ విషాదాంతంలోనూ కూడా పెద్ద సందేశం వుంది.
జాక్సన్‌ మరణానంతరం కూడా రోజుకో కథ. ఆయన కుటుంబం, సంబంధాలు, పిల్లలు, స్వలింగ సంపర్కాలు ఇలాటివాటినే ప్రపంచమంతా వెదజల్లుతున్నారు. ఆయన హత్యకు గురైనాడని దాదాపు ఖాయంగా చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు తేల్చవలసిందే. దోషులను శిక్షించవలసిందే. నిజమైనా ఇందులో పెద్దగా చెప్పుకోవలసిందేమిటన్నది మరొకటి. ప్రపంచాన్ని ఉర్రూతలూపిన ఆయన కళా ప్రతిభ తప్ప కళంకితమైన వ్యక్తిగత పోకడలు కాదు. కాని వాటితోనే వూదరగొట్టడం హీనమైన అభిరుచులను అందుకోవడానికి తప్ప మరెందుకు పనికి వస్తుంది?జాక్సన్‌ కోసం విలపించిన వారు,గుండెలు బాదుకుని ఏడ్చిన వారు ఆయన కళా ప్రతిభను కదా ఆరాధించింది? దాన్ని కాస్తా పక్కనపెట్టి ఆయన ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడో ఆయన పిల్లలు ఆయనకు పుట్టారో లేదో వీటిపై విభిన్న కథనాలలో ముంచి తేల్చడం ఎవరి కోసం? ఇలాటి కథలు చెప్పుకోవడానికి జాక్సన్‌ అయినా జాంబవంతుడైనా తేడా ఏముంటుంది?అంటే సందర్భం ఏదైనా సదరు వ్యక్తి ఎవరైనా సంసృతి మార్కెట్‌లో సరుకుగా ఏది చలామణి అవుతుందన్న ఆలోచన తప్ప మరొకటి వుండనే వుండదు.చావైనా బతుకైనా ఈ వేటలో ఒకటే. సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది , తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అన్న శ్రీశ్రీ శైలికి భిన్నంగా కొందరిని మహాకర్షనీయులుగా చేసి ఆ గోప్ప వారి చెత్త కబుర్లలో ముంచెత్తడం ఒక వ్యాపార సూత్రం. గతంలో రాజకుమారి డయానా ప్రమాద మరణం సందర్బంలో ప్రపంచ మీడియా పేపరాజ్ఞి గురించి పశ్చాత్తాపం ప్రకటించింది. ఆమె వర్ధంతి నాటికి బ్రిటిష్‌ మీడియా అధికారికంగానే ఆత్మ విమర్శ చేసుకుంది.క్షమాపణలు చెప్పింది. కాని ఫలితమేమిటి? జాక్సన్‌ విషయంలో ఆ వికృతం మరింత ఘోరంగా అక్షరాలా పైశాచికంగా పునరావృతమవుతున్నది.ఆయన ఆత్మను చిత్రించామని ఎవరో విడియో చిత్రాలు విడుదల చేస్తే విశ్వవ్యాపితంగా ప్రసారం చేయడం విజ్ఞతనూ విజ్ఞానాన్ని ఎగతాళి చేయడమే. నేటి సాంకేతిక విజ్ఞానంతో ఇలాటి చిత్రాలు తయారు చేయడం చాలా తేలికని అందరికీ తెలుసు.నిజానికి జాక్సన్‌ ప్రదర్శనలలో ఇంతకన్నా విచిత్రాలనే చూపించాడు. కాకపోతే అది కల్పన అని మనకు తెలుసు. ఇప్పుడు ఆ సాంకేతిక ఇంద్రజాలంతో ఆయన బతికున్నట్టు చూపిస్తున్నారంటే ఎంతటి బరితెగింపు? శాస్త్ర సాంకేతిక విజ్ఞానం స్వేచ్చా స్వాతంత్రాలు తమ స్వంతమైనట్టు చెప్పుకునే అమెరికా మీడియా పోకడలు అసహ్యం పుట్టిస్తాయి. ఉద్వేగాలతో వీలైనంత ఎక్కువ స్థాయిలో ఎక్కువ కాలం వ్యాపారం చేసుకోవడం తప్ప వాటికి వాస్తవాలతో నిమిత్తం వుండదు. తన పిల్లలను జాక్సన్‌ పిల్లలుగా ప్రచారం చేశానని హత్యారోపణలు ఎదుర్కొంటున్న ఆయన వ్యక్తిగత వైద్యుడు చెప్పడంలోనూ దాగి వుండేది ప్రచారం ద్వారా ఎక్కువ సొమ్ములు రాబట్టవచ్చునన్న అంచనానే.నీ గురించి మంచో చెడో ప్రచారం జరగడం మేలు అన్నది పాశ్చాత్య మీడియా ప్రధాన సూత్రం. దాని వికృత విశ్వరూపమే జాక్సన్‌ మరణానంతర విపరీత కథనాలు, ఆత్మ సందర్శనాలూ!

Monday, July 27, 2009

రిలయన్స్‌కు కేంద్రం ఊడిగం

2 వ్యాఖ్యలు

నయా ఉదారవాద విధానంలో భాగంగా దేశ ప్రజలకు చెందిన గ్యాస్‌ వంటి సహజ సంపదను స్వదేశీ, విదేశీ గుత్త పెట్టుబడిదారీ సంస్థలకు అప్పగించేందుకు గతంలో ఎన్‌డిఎ, ఆ తరువాత యుపిఎ ప్రభుత్వాలు ప్రైవేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేసి ప్రజా ప్రయోజనాన్ని బలి చేస్తున్నాయి. నూతన అన్వేషణ, లైసెన్సింగ్‌ విధానం (ఎన్‌ఇఎల్‌పి) కింద కృష్ణా-గోదావరి బేసిన్‌లో డి6 బ్లాక్‌లో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)కు అప్పగించి, కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఉత్పత్తి పంచుకునే ఒప్పందం (పిఎస్‌సి), అలాగే గ్యాస్‌ ధరను నిర్ణయించేందుకు మంత్రుల సాధికార కమిటీ అనుమతించిన సూత్రం ప్రజా ప్రయోజనాలకు నష్టదాయమైనది. ఈ ఉదంతం తెలియచేస్తోంది. ఆద్యంతం ముఖేష్‌ అంబానికి చెందిన రిలయన్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఎలా ఊడిగం చేస్తున్నదీ అంబానీ సోదరుల మధ్య గ్యాస్‌ సరఫరా, ధరలకు సంబంధించి ఇంతకుమునుపు బొంబాయి హైకోర్టులో, ప్రస్తుతం సుప్రీం కోర్టులో నడుస్తున్న వ్యాజ్యాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి దాని కాపట్యాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నది. అంతర్జాతీయ పోటీ బిడ్డింగులో ఎంఎంబిటియు గ్యాస్‌ను 2.34 డాలర్లకు ఎన్‌టిపిసి విద్యుత్‌ ప్రాజెక్టులకు 17 ఏళ్ళ పాటు 12 ఎంసిఎండి గ్యాస్‌ సరఫరా చేసేందుకు అంగీకరించి ఆర్‌ఐఎల్‌ ఎంపికయింది. ఆ ధరకు గ్యాస్‌ సరఫరా చేసేందుకు ఆర్‌ఐఎల్‌ తిరస్కరించటంతో ఎన్‌టిపిసికి, దానికి మధ్య బొంబాయి హై కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది. పోటీ బిడ్డింగులో నిర్ణయించిన ఈ ధర పిఎస్‌సిలో నిర్దేశించిన విధంగా పోటీ ప్రక్రియ ద్వారా (ఆర్మ్స్‌ లెంత్‌ సేల్‌) నిర్ణయించిన ధర అవుతుంది. అయితే, దానికి విరుద్ధంగా ఆర్‌ఐఎల్‌ ప్రతిపాదించిన మోసపూరిత సూత్రాన్ని అనుసరించి ప్రణబ్‌ ముఖర్జీ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల సాధికార కమిటి ఎంఎంబిటియుకు 4.20 డాలర్ల అధిక ధరను ఆమోదించింది. అంబాని సోదరులు ముఖేష్‌, అనిల్‌ల మధ్య వారి కుటుంబ ఆస్తుల పంపిణీ ఒప్పందంలో భాగంగా అనిల్‌కు చెందిన ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు 17 ఏళ్ళ పాటు 28 ఎంసిఎండి గ్యాస్‌ను ఎంఎంబిటియుకు 2.34 డాలర్ల చొప్పున సరఫరా చేసేందుకు ఆర్‌ఐఎల్‌ అంగీకరించిది. ఆ విధంగా గ్యాస్‌ను అనిల్‌ ప్రాజెక్టులకు సరఫరా చేసేందుకు ఆర్‌ఐఎల్‌ తిరస్కరించటంతో అన్నదమ్ముల మధ్య బొంబాయి హై కోర్టులో వ్యాజ్యం నడిచింది. ఆ ఒప్పందంలో అంగీకరించిన విధంగా గ్యాస్‌ పరిమాణం, సరఫరా కాలం, ధరల ఆధారంగా ఇరు పార్టీలు నెల రోజుల్లో తగు ఏర్పాటు చేసుకోవాలని బొంబాయి హై కోర్టు జూన్‌ 15న తీర్పు ఇచ్చింది.

హై కోర్టు తీర్పుపై అన్నదమ్ములిద్దరూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా పార్టీగా చేరింది. ఆర్‌ఐఎల్‌ కాంట్రాక్టరు మాత్రమేనని, మంత్రుల సాధికార కమిటీ నిర్ణయించిన గ్యాస్‌ వినియోగ విధానం ప్రకారమే గ్యాస్‌ పంపిణీ జరగాలని, ఆర్‌ఐఎల్‌, ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ల మధ్య కుదిరిన కుటుంబ ఒప్పందంతో తనకు సంబంధం లేదని కేంద్రం పేర్కొంది. ఈ గ్యాస్‌, దాని ధర, పంపిణీపై అన్నదమ్ములిద్దరికి యాజమాన్య హక్కు ఏమీ లేదని పేర్కొంది. కాని, కేంద్రం విధానం అలాంటి సహజ సంపదను ప్రైవేటు గుత్త పెట్టుబడిదారీ సంస్థలకు దోచిపెట్టేదిగా ఉంది. పిఎస్‌సిలోని నిబంధనలు, పార్లమెంటులో ప్రభుత్వం ఇచ్చిన వివరణలు, మంత్రుల సాధికార కమిటీ సమావేశాల వివరాలు ప్రభుత్వం ఇప్పుడు సుప్రీం కోర్టులో చేస్తున్న వాదనలకు భిన్నంగా ఉన్నాయి. మంత్రుల సాధికార కమిటీ ఎంఎంబిటియుకు 4.2 డాలర్లుగా నిర్ణయించిన ధర ప్రభుత్వం గ్యాస్‌ విలువను మదింపు చేయడానికేనని, ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌లో విక్రయించే ధరను ప్రభుత్వం నిర్ణయించదని ఆ వివరణల సారాంశం. అంటే ఎటువంటి నియంత్రణ లేకుండా ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌లో తనకు ఇష్టం వచ్చిన ధరకు గ్యాస్‌ను విక్రయించుకోవచ్చుననేది ఈ వివరణల సారాంశం. గ్యాస్‌ వినియోగం విధానానికి సంబంధించి, ఒకసారి ప్రభుత్వం గ్యాస్‌ ఆధారిత ప్రాజెక్టులను, కర్మాగారాలను నెలకొల్పడానికి అనుమతించాక, వాటికి అవసరమైన గ్యాస్‌ కేటాయింపు చేయాలనేది నిర్వివాదాంశం. వాటిలో రాష్ట్రంలోని గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టులు, ఎన్‌టిపిసి, అనిల్‌ అంబానీల ప్రాజెక్టులు కూడా ఉంటాయి. గ్యాస్‌ విలువ మదింపు నిమిత్తమే మంత్రుల సాధికార కమిటీ 4.2 డాలర్ల ధరను నిర్ణయించిందన్న వాదన ప్రకారం, ప్రభుత్వ వాటాగా రావాల్సిన గ్యాస్‌ను ఆర్‌ఐఎల్‌ అమ్మడానికి అనుమతించే పక్షంలో ఆ ధర ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాలనేది దానిలో ఇమిడి ఉన్న అంతరార్థం. ఆర్‌ఐఎల్‌ వాటాగా లభించే గ్యాస్‌ను మార్కెట్‌లో ఏ ధరకు విక్రయించినా, ఆ సంస్థ పెట్టిన పెట్టుబడిపై రెండున్నర రెట్ల మొత్తాన్ని పిఎస్‌సిలో అనుమతించిన విధంగా పొందటానికి 4.2 డాలర్ల లెక్కనే పరిగణించాలనేది ఈ వివరణలలో అంతర్లీనంగా ఉన్న మరొక అంశం. లేదా ఎంఎంబిటియుకు 4.2 డాలర్ల కన్నా అధిక ధరకు ఆర్‌ఐఎల్‌ గ్యాస్‌ను విక్రయిస్తే దానిని ఎలా సర్దుబాటు చేయాలనేది అనిశ్చితంగా ఉంటుంది. బొంబాయి హైకోర్టు తీర్పు ఇచ్చిన విధంగా ఆర్‌ఐఎల్‌ వాటా గ్యాస్‌ నుండే అనిల్‌ అంబాని గ్రూపుకు 2.34 డాలర్ల ధరకు గ్యాస్‌ సరఫరా చేస్తే తనకు వచ్చే నష్టం ఏమిటనేది కేంద్రం వివరించకుండా దాట వేయటం దాని మోసపూరిత వైఖరిని వెల్లడిస్తున్నది. ఎన్‌టిపిసి-ఆర్‌ఐఎల్‌ కేసులో తన విధానం ఏమిటనేది కేంద్రం స్పష్టం చేయకుండా దాట వేస్తున్నది. గ్యాస్‌ వినియోగం, ధరల నిర్ణయంపై తనదే అధికారం అనేది కేంద్రం విధానమైతే తాను కేటాయించిన వారికే, తాను నిర్ణయించిన ధరకే గ్యాస్‌ను విక్రయించాలని స్పష్టం చేయాలి. అమలు చేయాలి. పారదర్శకంగా నిర్ధారించగల న్యాయమైన పెట్టుబడి వ్యయం, సంబంధిత క్షేత్రంలో ఉత్పత్తి చేసేందుకు లభ్యమయ్యే నిర్ధారిత గ్యాస్‌, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల పరిమాణం ఆధారంగా, న్యాయమైన లాభంతో కూడిన విధానం వుండాలి. ఆ విధంగా స్వదేశీ గ్యాస్‌ విక్రయ ధరలను డాలర్లలో కాకుండా రూపాయిలలో కేంద్రం నిర్ణయించి, నియంత్రించాలి. అనుమతించిన గ్యాస్‌ ఆధారిత ప్రాజెక్టులు, కర్మాగారాలకు అవసరమైన గ్యాస్‌ను కేటాయించి, సకాలంలో సరఫరా జరిగేటట్లు చూడాలి. వాటి స్థాపక సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు వీలుగా అవి పనిచేసే ఉపయోగకరమైన జీవిత కాలానికి సరిపడే విధంగా గ్యాస్‌ కేటాయింపులను, ఉత్పత్తిని, సరఫరాను నియంత్రించాలి. అలా చేయకుండా, న్యాయస్థానాలలో కేంద్రం డొంకతిరుగుడు వాదనలు చేయటం ఆర్‌ఐఎల్‌కు ఊడిగం చేయటానికే.

  Friday, July 24, 2009

  విమానయాన సంస్థపై విష ప్రచారం

  3 వ్యాఖ్యలు
  విమానయాన సంస్ధకు అవసాన దినం సమీపించిందంటూ కార్పొరేట్‌ ప్రసారమాధ్యమం, యాజమాన్యం, మంత్రిత్వ శాఖ ప్రచారం చేస్తున్నాయి. అంతేకాక, 'నిర్వహణ లేదా వినాశనం ప్యాకేజీ' కింద వేతనాలు కోరకుండా పనులను చేయవలసిందిగా సిబ్బందిని కోరుతున్నారు. కాని లాభ నష్టాలకు సంబంధించిన వార్షిక బ్యాలెన్స్‌ పత్రాన్ని మాత్రం ప్రకటించటం లేదు.

  గత నెలలో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ (ఐఏ), ఎయిర్‌ ఇండియా (ఏఐ) సంస్ధలను ప్రభుత్వం విలీనం చేసింది. ఈ సందర్భంగా నేషనల్‌ ఏవియేషన్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఏసిఐఎల్‌) ఉద్యోగులను ఉద్దేశించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మాట్లాడుతూ తీవ్రంగానే బెదిరించారు. నిధులు లేవని చెపుతూ జూన్‌ నెల వేతనాలను ఆపివేశారు. ఇదే సమయంలో ఎయిర్‌ ఇండియా నష్టాలలో పడిందంటూ ప్రసారమాధ్యమం ప్రచారాన్ని అందుకున్నది. మంత్రిత్వ శాఖ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారాన్ని చేయించింది. దాదాపు రూ.7,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని పత్రికలైతే ఈ నష్టాన్ని రూ.5,000 కోట్లుగా అంచనా వేశాయి. దాదాపు 35,000 నుంచి 50,000 వరకు వున్న సిబ్బందే ఎయిర్‌ ఇండియాకు పెను భారంగా తయారయ్యారన్న ప్రచారం జరిగింది. సిబ్బందిని తగ్గించాలని, వేతనాలలో కోత విధించాలని, వేతనాలను ఇవ్వటం ఆలస్యం అయినా సర్దుకుపోవాలని కార్పొరేట్‌ ప్రసారసాధనాలు సిబ్బందికి సుద్దులు చెప్పసాగాయి.

  విలీన గారడీ
  2004-05, 2005-06 సంవత్సరాలలో లాభాలను ఆర్జించిన అనంతరం 2006-07లో నిజానికి నష్టాలు లేనేలేవు. ఉన్నదంతా విలీనం పేరుతో జరిగిన గారడీయే. ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లను నాసిల్‌ (ఎన్‌ఏసిఐఎల్‌) పేరుతో విలీనం చేస్తున్నట్లు 2007-08 వార్షిక నివేదికలో పౌర విమానయాన శాఖ పార్టమెంటుకు తెలిపింది. ఈ విలీనం కారణంగా ససంస్ధ సామర్ధ్యం పెరగటంతోపాటు భారతదేశంలోనే అతిపెద్ద సంస్ధగా రూపొందగలదని, ఆదాయం విషయంలో ప్రపంచంలోనే 31వ స్ధానంలో నిలబడగలదని ఇంకాఇంకా పలు లాభాలు ఉండగలవని ఈ నివేదికలో చెప్పుకొచ్చింది. ఇన్ని ప్రయోజనాల గురించి చెప్పిన మంత్రిత్వ శాఖ పౌర విమాన పరిశ్రమ ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను విస్మరించింది. ఈ నెల 9వ తేదీన మంత్రి ఒక ప్రకటన చేస్తూ ప్రయాణీకుల తగ్గుదల, మార్కెట్‌లో పోటీ పెరగటం, ఇంధన వ్యయం పెరుగుదల వగైరాలు పెద్ద సమస్యలుగా మారాయని చెప్పారు. అయితే మంత్రిగారు ఏ ప్రాతిపదికపై ఈ విషయాలు చెప్పారు. విమానయాన సంస్ధలు రెండింటినీ విలీనం చేసేటపుడుగానీ, రూ.50,000 కోట్లు ఖర్చు చేసి 111 విమానాలు కొనుగోలు చేయాలనుకున్నపుడుగానీ లోతైన విశ్లేషణ జరిపారా? బలము, బలహీనత, అవకాశాలు, ప్రమాదాలు ప్రాతిపదికపై విశ్లేషణ జరపాల్సి వుంది. ప్రస్తుతం జరుగుతున్న వ్యాపారమేకాక మార్కెట్‌ ఇబ్బందులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితి వగైరాలను పరిశీలించాలి. ఇవన్నీ తెలియని విషయాలేమీ కాదుగదా? తప్పుడు విధానాలతో విమానయాన సంస్ధను సంక్షోభంలోకి నెట్టివేసి వాస్తవాలకు పాతర వేసినవాళ్ళే ఇప్పుడు ఉద్యోగులపై బాధ్యతను నెట్టివేస్తున్నారు. విమానయాన సంస్ధకు అవసాన దినం సమీపించిందంటూ కార్పొరేట్‌ ప్రసారమాధ్యమం, యాజమాన్యం, మంత్రిత్వ శాఖ ప్రచారం చేస్తున్నాయి. అంతేకాక, 'నిర్వహణ లేదా వినాశనం ప్యాకేజీ' కింద వేతనాలు కోరకుండా పనులను చేయవలసిందిగా సిబ్బందిని కోరుతున్నారు. కాని లాభ నష్టాలకు సంబంధించిన వార్షిక బ్యాలెన్స్‌ పత్రాన్ని మాత్రం ప్రకటించటం లేదు. 2007-08 సంవత్సరానికిగాను నాసిల్‌ మొట్టమొదటి వార్షిక నివేదికను తయారు చేసిన 15 నెలల తరువాత ప్రకటించారు. అకస్మాత్తుగా రూ.2226 కోట్లు నష్టం వచ్చినట్లుగా ఈ పత్రం తెలియచేస్తున్నది. అసలు ఈ పత్రాన్ని ప్రవేశపెట్టటంలో అసాధారణమైన జాప్యం ఎందుకు జరిగినట్లు? దీని తరువాతిదైన 2008-09 బ్యాలెన్స్‌ షీటు ఎక్కడ ఉన్నది? ఈ నెల 9వ తేదీన మంత్రిగారు ఒక ప్రకటన చేస్తూ ఈ ఏడాది నష్టం రూ.5,000 కోట్లు ఉండగలదని చెప్పారు. ఇవేమీ ఆడిట్‌ చేసి చెప్పిన లెక్క కాదు. కేవలం అంచనాలతో చెప్పినది మాత్రమే. బ్యాలెన్స్‌ షీట్‌ను చూడకుండా కార్పొరేట్‌ ప్రసారమాధ్యమం, ప్రభుత్వం కలసి ఉద్యోగులే నష్టాలకు కారణమని చెపుతున్నాయి.ఒకప్పుడు ఆకాశాన్నంటిన ఇంధనం ధరలు ఇప్పుడు నేలకు దిగిరావటంతో సర్‌ఛార్జ్‌ తగ్గే అవకాశం వచ్చిందని, మొత్తంమీద మున్ముందు సంస్ధకు లాభాలు రాగలవని గత డిసెంబరులో యాజమాన్యం చెప్పింది. కాని ఆరు నెలలు తిరగకముందే ప్లేటు మార్చింది. ''చూడండి మేము దివాళా తీశాము. వేతనాల చెల్లింపుకు మాదగ్గర మూల ధనం కూడా లేదు. సిబ్బందిని తగ్గించక తప్పదు.....'' అంటూ యాజమాన్యం ప్రకటన ఇచ్చింది. ఈ పరిస్థితిలో సంస్ధను ''నిర్వహించటమో లేక నాశనం'' కావటమో తేల్చుకోవలసి ఉంటుందని మంత్రి చెపుతున్నారు. ''నాశనం'' అంటే కొత్తగా దిగుమతి చేసుకుంటున్న 111 విమానాలతోపాటు విమానయాన సంస్ధను ప్రైవేటీకరించటమన్న మాట.

  విలీనం తరువాత జరిగిందేమిటి?
  ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేసిన తరువాత 2007-08లో రూ.2226 కోట్లు నష్టం వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నష్టం 2008-09లో రూ.5000 కోట్లకు పెరగవచ్చునని కూడా తెలిపింది. విమాన సంస్ధలో ప్రధానమైనది ఇంధన వ్యయం.2008లో బారెల్‌ సగటు ధర 94.85 డాలర్లుకాగా, 2009లో ఇది 51.85 డాలర్లుగా ఉన్నది. అంటే 2009 జనవరి నుంచి జూన్‌ వరకు సంస్ధకు ఇది కొంత ఉపశమనాన్ని కలిగించే విషయమన్నమాట. ఇంతకుముందు ప్రకటించిన బాలెన్స్‌ షీటు ప్రకారం 2007-08లో సిబ్బంది వ్యయం మొత్తం వ్యయంలో 18.4 శాతం. లాభాలు ఆర్జిస్తున్న సెయిల్‌, భెల్‌ తదితర సంస్ధలతో పోలిస్తే ఈ వ్యయం హేతుబద్దమైనదే. విలీనానికి ముందు రెండు సంస్ధలు లాభాలలో నడిచాయి. కాని విలీనం తరువాత ఒక్కసారిగా నష్టాలు వచ్చాయి. 2005-06లో రెండు సంస్ధల ఆదాయం కలిపి రూ.15031 కోట్లు. 2007-08లో అంటే, విలీనం తరువాత స్వల్పంగా పెరిగి రూ.15257 కోట్లకు చేరింది. వ్యయం విషయానికి వస్తే రూ. 14923 కోట్ల నుంచి రూ.17,854 కోట్లకు పెరిగింది. ఇంతగా పెరగటానికి కారణమేమిటి? ఈ కాలంలోనే సిబ్బంది 1260కి తగ్గిపోయింది. ఇంధన వ్యయం కూడా తగ్గింది. కాగా వడ్డీల చెల్లింపులో పెరుగుదల ఉన్నది. 2005-06లో రూ.105 కోట్లు వడ్డీ చెల్లించగా 2007-08లో ఈ మొత్తం రూ.701 కోట్లకు పెరిగింది.విమానయాన సంస్ధను సక్రమంగా నడపాలంటే సిబ్బందికి నీతులు చెప్పటమేకాక, ప్రభుత్వం కూడా చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సి ఉంటుంది. అలా చేసినపుడు మాత్రమే విమానయాన సంస్ధ గతంలోవలెనే లాభాల బాట పడుతుంది.

  Thursday, July 23, 2009

  దేవుడు ఉన్నాడా? లేడా? లేడనుకుంటే మనుషులకు పూనకాలు ఎందుకు వస్తున్నాయి?

  8 వ్యాఖ్యలు
  దేవుడు ఉన్నాడని కొందరు అంటారు. లేడని కొందరు అంటారు. ఇంతకూ దేవుడు ఉన్నాడా? లేడా? లేడనుకుంటే మనుషులకు పూనకాలు ఎందుకు వస్తున్నాయి? పూనకాలు వచ్చినవారు కేవలం నటిస్తున్నారా?
  - డి.కార్తీక్‌, 9వ తరగతి, బాలభారతి పాఠశాల, ఆదిలాబాదు.


  'దేవుడి'ని నమ్మేవారే వివిధ రకాలుగా భాష్యం చెబుతారు. ఈ విశ్వం మొత్తంలో ఉన్న క్రమానుగతినే మనం 'దేవుడు' అంటాము - అని కొందరంటారు. 'క్రమాను గతి' తెలుగు వ్యాకరణం ప్రకారం 'నపుంసకలింగా'నికి సంబంధించిన పదం. కాబట్టి 'దేవుడు' అంటూ పుంలింగాన్ని ఆపాదించకుండా 'దైవం' అని ఆ క్రమానుగతిని వారు పేర్కొంటే ప్రపంచంలో ఎవరికీ అభ్యంతరంలేదు. విశ్వంలో క్రమానుగతి తప్పకుండా ఉంది. 'దైవం' అనే పదం ఆ క్రమానుగతికి మరో పర్యాయపదం అని మనమూ, ప్రపంచంలోని అందరూ సర్దుకుపోగలము. ఈ విషయంలో కరుడుగట్టిన నాస్తికవాదులకు కూడా అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు.
  మానవజాతికి, ఇతర జీవజాతులకు ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే మానవుడే ఆలోచిస్తాడు. క్రమమేమిటో, అక్రమమేమిటో గుర్తిస్తాడు. సాధారణ విషయాలేవో, అసాధారణ విషయాలేవో పసిగడతాడు. తన ప్రాణానికి, తనతోటి బృందపు సంక్షేమానికి ప్రమాదం వాటిల్లినపుడు ప్రమాదం కల్గించే అంశాలనే మార్చి ప్రమాదరహితంగా రూపొందిస్తాడు. ఆ క్రమంలో తనకర్థంగాని వాటిపట్ల, అసాధారణ విషయాలైన గ్రహణాలు, తోకచుక్కలు, వరదలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు, సునామీలు, తుపానులు, ఇంద్రధనస్సులు, ఉరుములు, మెరుపులు వంటి అరుదైన సంఘటనలపట్ల విస్మయము, సంభ్రమము, భయాందోళనలు చెందేవాడు. ప్రతి మానవ కార్యక్రమంలో మనిషి ప్రయత్నపూర్వక హస్తమున్నట్లే ఇలా అరుదుగా సంభవించే సంఘటనల పట్ల కూడా ఎవరో మానవాతీతవ్యక్తి లేదా శక్తి ప్రమేయం ఉండవచ్చునని ఊహించాడు. ప్రజల్లో సహజంగా ఉండే ఇలాంటి సందిగ్ధతను, సందేహాలను, 'దేవుడు', 'దయ్యం', 'పూజలు', సంతుష్టిపరిచే 'పబ్బాలు', 'మొక్కులు', 'బలులు', 'అప్పగింతలు', 'త్యాగాలు', 'ఆలయ నిర్మాణాలు', అనే తంతుతో పాలకవర్గాలు మొగ్గలోనే తుంచి అక్కడికక్కడ సర్దిచెప్పేవి. ఈ విధమైన తాత్కాలిక ఉపశమనంతో సర్దిచెప్పడం వల్ల ప్రజల హేతువాద దృక్పథం, తార్కిక విశ్లేషణ, సంపూర్ణ సత్యాన్వేషణాసక్తి రాటుదేలేవి కావు. క్రమేపీ 'దేవుడు', 'దయ్యం' భావాలు ప్రజల్లో ఉంటే పాలకవర్గాలకు మరింత ఊతంగా ఉండేలా సంస్కృతి, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితులు నెలకొన్నాయి. గత చరిత్ర అంతా ఈ విధంగానే నడిచింది. మానవజాతిలో ఏర్పడిన భౌగోళిక, భాషా పరిణామాలకు అనుగుణంగానే 'దేవుడు' అనే భావనలు, రూపాలు, దేవాలయాలు, ప్రార్థనామందిరాలు, స్వరూపాలు మారుతూ వచ్చాయి. మానవాతీతశక్తులు, ఏది కావాలంటే అది చేయగల మహా మహా అద్భుత కార్యకలాపాలు 'దేవుడి'కి ఆపాదించడం జరిగింది. 'దేవుడు' పాలకులకు మొదటి మిత్రుడయ్యాడు. పాలితులకు సర్దిచెప్పే సలహాదారుడయ్యాడు. యథాతథ సమాజ రూపానికి దన్నుగా నిలిచాడు. మార్పు అవసరంలేని పరిస్థితికి ఆలంబనగా తోడయ్యాడు. మనిషి ఎదుర్కొనే ప్రతి కష్టానికి, సుఖానికి, దుఃఖానికి కారణ భూతుడయ్యేలా అదే మనిషి నమ్మే పరిస్థితికి చేరుకున్నాడు.

  శక్తి సామర్థ్యాలు, రూపురేఖలు, జన్మ వృత్తాంతాలు ఆయా సమాజాల్లోని మానవ సమూహాల అభిరు చుల కనుగుణంగా 'దేవుడు', 'దైవభావన' రావడం వల్ల దేవుళ్ళు చాలామందయ్యారు. అది ఏ మానవ సమూహమైనా, వర్గ సమాజంగా ఉన్నంతవరకు ఆ దేవుడి రూపురేఖలు, ఇతర శక్తియుక్తులు, ప్రతిభలు వేర్వేరుగా ఉన్నా ఆయావర్గ సమాజాల్లో పాలకవర్గానికి బలాన్ని చేకూర్చే దేవుళ్ళుగానే వర్ధిల్లారు. వివిధ సంస్కృతులు, అలవాట్లు, భాషలు, దైవభావనలు ఉన్న మానవులు సార్వత్రిక సమస్యల పట్ల ఐక్యమవుతున్న సందర్భాలలో అదే పాలకవర్గాలు ఆయా జాతులకు అత్యంత ప్రీతిపాత్రమైన వారి వారి దేవుళ్ల భావాల మధ్య అనైక్యతను సృష్టించేవారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేవారు. నేటికీ ఇటువంటి పరిస్థితులు భారతదేశంలో ఇతర దేశాల్లోనూ కొనసాగుతున్నాయి. మనిషి కష్టాలకు కారణాలు వర్తమాన ప్రపంచంలోనే, నిజజీవితంలోనే ఉన్నాయనీ, ఆ కష్టాల నివృత్తికి సమిష్టిగా పరిష్కారమార్గాలను అన్వేషించాలనీ మానవులందరూ తెలుసుకున్న రోజు 'దేవుడి' భావన ప్రజలకు అవసరం ఉండదు.

  పేదరికం, దుఃఖం, వేదన, అనారోగ్యం, ఆకలి, దప్పిక, అవిద్య, క్రూరత్వం, అమానుషత్వం ప్రకృతిలో సహజమైనవి కావు. అవి ప్రకృతిలోని క్రమత్వానికి సాక్ష్యాలు కానేకావు. క్రమత్వానికి, సర్వశక్తి సంపన్నతకు ఆలవాలమైన దేవుణ్ణి నమ్మే ప్రతి సామాజికవర్గం తమ వేదనల్ని, కష్టాల్ని పోగొట్టమని వేడుకోని రోజు ఉండదు. కొన్నివేల సంవత్సరాలుగా ఆ దేవుణ్ణి పేరు పేరునా ప్రార్థిస్తున్నారు. పదే పదే పూజలు చేస్తున్నారు. కానీ వేదనలు, నొప్పులు, అకాలమరణాలు, క్రూరమైన సంఘటనలు, కష్టాలు, దుఃఖాలు మెజారిటీ మనుషుల్ని పీడిస్తూనే ఉన్నాయి. గత జన్మ పాపులుగా వారికో స్టిక్కరేసి 'మీ ఖర్మ ఇంతే' అని వారిని గిరాటేస్తున్నారు. 'చేసేది, చేయించేది, నడిపేది, నడిపించేది, కదిలేది, కదిలించేది, బాధపడేది, బాధపెట్టించేది, దుఃఖించేది, దుఃఖాన్ని కల్గించేది ఆ దేవుడేనని కష్టాల బయటున్న వారు అంటుంటే అర్థంచేసుకోలేని దయనీయపుటజ్ఞానపు మత్తులో ప్రజలుంటున్నారు. వేదన, మనోవేదన రెండింటినీ భరించేకంటే తాత్కాలిక ఉపశమనంగా మనోవేదనను మరిపించేలా విషపూరితం కాని మత్తు ద్రవ్యంగా 'దేవుడి భావన', 'దేవుడి దయ', 'దైవేచ్ఛ', 'దేవుడి లీలలు' వంటి భావజాలాలు ఉపకరిస్తున్నాయి.

  క్రమత్వానికి ఆపాదించబడిన దైవభావన కేవలం ఊహలకే పరిమితమయిపోయింది. కోరికలు తీర్చేవాడిగానూ, దుష్టులని కొందరిని తయారుచేసి వారిచేత దుష్టకార్యక్రమాలను తానే చేయించి ఆ బాధలు పడేవారిని తానే తన దగ్గరకు 'దేవా రక్షించు' అని రప్పించుకొని మళ్లీ తానే దుష్ట సంహారం చేసే అర్థంగాని మనసున్నవాడిగానూ దేవుడు కీర్తించబడుతున్నాడు. పూజలు అందుకుంటున్నాడు. ప్రపంచంలో మెజారిటీ ప్రజలకు కనిపించని బంధువు అయ్యాడు.

  'దేవుడు ఉన్నాడా?' 'లేడా?' అన్న ప్రశ్నకు సమాధానం వెదికి తలబద్దలు కొట్టుకొనేకన్నా మనిషే మానవ చరిత్రను నడిపాడనీ, మనిషే దేవాలయాలను నిర్మించాడనీ, మనిషే విగ్రహాలను రూపొందించాడనీ, మనిషే పురాణ గ్రంథాల్ని రచించాడనీ, మనిషి అప్రమత్తంగానే శ్రమద్వారా, ప్రయత్న పూర్వకంగా చేసిన కార్యక్రమాలే మానవ జీవితాన్నీ, నాగరికతనీ, సంస్కృతినీ, వేదాంతాన్నీ, తత్త్వశాస్త్రాన్నీ రూపొందించాయన్న తిరుగులేని సత్యాన్ని అందరం నమ్ముదాము.

  దేవుడి మీద నమ్మకానికీ, పూనకాలకూ సంబంధం ప్రత్యక్షంగా ఏమీ లేదు. నువ్వన్నట్లు చాలా మంది పూనకందార్లు ఏదారీ లేక పూనకపు దార్లు తొక్కుతున్నారు. హిస్టీరియా జబ్బుతో కొందరు, బాధలు వెళ్లగక్కుకోవడానికి మరికొందరు పూనకాలను పూనుకుంటున్నారు.

  విజ్ఞానశాస్త్రంపై మతదాడి-1

  72 వ్యాఖ్యలు

  ప్రాచీనకాలంలోనే భారతదేశం విజ్ఞానశాస్త్రానికి నిలయమైంది. ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు ప్రపంచానికి అనేక మహత్తర పరిశోధనా ఫలితాలను అందించారు. శాస్త్రాలకే మూలశాస్త్రంగా ఉన్న గణితశాస్త్రంలో 'సున్నా'ను అందించిన ఘనత మనవారిదే. అన్ని ఆకుల ఔషధ గుణాలను ఔపోశనపట్టిన చెరకుడు మన ప్రాచీన వైద్యశిఖామణి. భూమి - చంద్రుల వ్యాసార్థలను, గ్రహాల చలనాల ద్వారా వచ్చే గ్రహణాలను లెక్కించిన ఖగోళ శాస్త్రజ్ఞులు ఆర్యభట్ట, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు మనవారే. విజ్ఞానశాస్త్ర పరిశోధనల కారణంగా మన భారతీయ విశ్వవిద్యాలయాలకు ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు వచ్చేవారు. వారందరూ భారతీయ శాస్త్రవేత్తలను ఆచార్యులుగా అంగీకరించారు. అదే సమయంలో మతనాయకులు దురదృష్టవశాత్తుగా ఆ శాస్త్రవేత్తలపై తీవ్ర దాడి చేసి, వారి నోటితోనే 'విజ్ఞానశాస్త్ర పరిశోధనా ఫలితాల'కంటే మతనాయకుల 'ప్రవచనాలు' సరైనవని చెప్పించారు. దీన్ని ధృవపరచుకోడానికి కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. ఆచార్య చెరకుడు వైద్య శాస్త్రంలో నిష్ణాతుడు. ఈయన 'చెరకు సంహిత' అనే వైద్య శాస్త్ర మహాగ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథం ప్రథమ భాగంలోనే ఇలా అంటాడు. 'శరీర ధర్మాలను మాత్రమే కాక, ప్రతిభ, తెలివితేటలు కూడా ఆహారం నుంచే వస్తాయి (చెరకు సంహిత 80వ పేజీ). ఇంకొంచెం ముందుకు వెళ్లి వైద్యశాస్త్రం యొక్క ప్రాధాన్యతలను ఇలా వివరిస్తాడు. ''పదార్థానికి సంబంధించిన వివిధ రకాల జ్ఞానం మాత్రమే వైద్యశాస్త్రానికి అవసరం. చికిత్సా విధానంలో పదార్థాన్ని దాటిపోవడాన్ని ఊహించలేం'' (చెరకు సంహిత 174వ పేజీ). వివిధ రోగాల చికిత్సకు ఏఏ పదార్థాలు వాడాలో గ్రంథంలో వివరించారు. ఉదాహరణకు వివిధ రోగాలకు, ఆవుకు సంబంధించిన పదార్థాలు ఎలా వాడాలో వివరించారు. ''గోమాంసంతో తయారుచేసిన పులుసును వరుస తప్పి వచ్చే జ్వరానికి, క్షయకు, నీరసానికి మందుగా ఉపయోగించాలి. ఆవు కొవ్వును బలహీనతకు, కీళ్లవాతానికి మందుగా వాడాలి. ఆవు మాంసాన్ని పొగవేస్తే శ్వాసకోశ వ్యాధులు, ఆవు కొమ్ముల్ని కాల్చి, ఆ గాలిని పీలిస్తే కఫ రోగాలు పోతాయి'' అని తెలిపారు (పై గ్రంథం 186-187 పేజీలు). చికిత్సా విధానానికి పదార్థానికి గల సంబంధాన్ని గూర్చి ప్రథమంలోనే ఇంతగా వివరించిన ఆ మహా వైద్యులు ఆ తర్వాత భాగంలో రోగాలకు అధిభౌతిక కారణాలు ఉంటాయని, వాటి చికిత్సకు పదార్థం అవసరం లేదని అంటాడు. ఉదా: ''కుష్టు రోగానికి కారణాలు ఏమిటి?'' అని ప్రశ్నించి... ''దైవ ద్రోహం, పాపకార్యాలు చేయడం. గత జన్మలోని పాపాలు కుష్టురోగానికి కారణాలు.' అని పేర్కొంటాడు. (పై గ్రంథం 298వ పేజీ). 'దీనికి చికిత్స ఏమిటి?'' అని ప్రశ్నించి.. ''దేవతలు, దేవదూతలను సేవించి, ఈశ్వరుడు, అతని భార్య ఉమను భక్తితో పూజించడం అని సమాధానం ఇస్తాడు'' (అదే పుస్తకం 298 పేజీ). (మిగతా తదుపరి టపాలో http://vasavya.blogspot.com/2009/07/1.html )

  Wednesday, July 22, 2009

  భారత్‌-అమెరికా ఉమ్మడి ప్రకటన హానికరం

  1 వ్యాఖ్యలు
  అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ పర్యటన అనంతరం భారత్‌-అమెరికా విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక పొత్తును మరింత పటిష్టపరచాలని కోరుతోంది. '21వ శతాబ్దంలో ప్రపంచ సౌభాగ్యాన్ని, సుస్థిరతను పెంపొందించేందుకు' సంబంధాల్లో మార్పులు రావాలంటూ గొప్పగా మాట్లాడినప్పటికీ అందులోని అంశాలు, కుదుర్చుకొన్న ఒప్పందాలు నిజంగా భారత ప్రయోజనాలకేనా అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అమెరికా పరికరాల తుది వినియోగ నియంత్రణపై ఉభయ పక్షాలూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించారు. అలాంటి ఒప్పందం అమెరికా సరఫరా చేసే పరికరాలను ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని తనిఖీ చేసేందుకు వీలుకల్పిస్తుంది. భారత్‌తో పెరుగుతున్న సైనిక సహకారం అమెరికా ప్రయోజనాలకు కీలకమైంది. భారత్‌ వందల కోట్ల డాటర్ల సైనిక పరికరాలు కొనుగోలు చేయాలని అది భావిస్తోంది. తుది వినియోగ నియంత్రణ ఒప్పందం అనేది 'అణు సహకార రంగంలో భారత్‌, అమెరికా సంతకాలు చేసి ఒప్పందంలో చేపట్టాల్సిన అత్యంత ముఖ్యమైన అంశం' అని హిల్లరీ భారత పర్యటన సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ ఉపమంత్రి ఫిలిప్‌ జె క్రాలే పత్రికలకు తెలిపారు. అణు ఒప్పందం భారత్‌ను అమెరికాకు జూనియర్‌ భాగస్వామిని చేస్తుందని, ఒప్పందంలోని నిబంధనలు సైనికంగా భారత్‌ను అమెరికాకు కట్టుబడేట్లు చేస్తాయి.
  తుది వినియోగ నియం త్రణ ఒప్పందం భారత సైనిక దళాలు పెంటగాన్‌కు మరింతగా లోబడి ఉండేలా చేస్తుంది. భారత్‌-అమెరికా అణు ఒప్పందంతో దానికి సంబంధం లేదని హిల్లరీ చెబుతున్నప్పటికీ భారత్‌కు అణుశుద్ధి, రీప్రాసెసింగ్‌ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకుండా చేసే దిశగానే అమెరికా కదులుతోంది.
  ఇటీవలి జి-8 నిర్ణయం దీన్నే ధృవీకరించింది. ఇంకా అమెరికా సరఫరా చేసే వినియోగించిన ఇంధన సరఫరా ఒప్పందాన్ని భారత్‌ చేసుకోవలసి ఉంది. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం గతంలో 10 వేల మెగావాట్ల అణు రియాక్టర్లు కొనుగోలు చేస్తానని వాగ్దానం చేసింది. ఈ అణు ఒప్పందాన్ని ప్రపంచ అణు వ్యాప్తి నియంత్రణ పరిధిలోకి తేవాలని అమెరికా భావిస్తోంది. ఈ అంశాలన్నీ ఒక కొలిక్కి వచ్చే వరకూ అమెరికా అణు రియాక్టర్ల కొనుగోలుకు సంబంధించి భారత్‌ ఎలాంటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోరాదని సిపిఎం పునరుద్ఘాటించింది. భారత విధాన నిర్ణయాల్లో అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు ప్రాధాన్యత ఉండాలని ఆ ఉమ్మడి ప్రకటన స్పష్టంగా తెలిపింది. దీన్ని ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంలోనూ, భారత్‌-అమెరికా ఉమ్మడి సిఇఓ వేదికలోనూ రూపొందించబోతున్నారు. ఈ లాబీయింగ్‌ వేదికలకు అనుగుణంగానే ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌, ఉన్నత విద్య, తదితర రంగాల్లోకి ఎఫ్‌డిఐని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం మరింతగా అనుమతించబోతోంది. అదే సమయంలో ఇరాన్‌ పట్ల శత్రు వైఖరిని చేపట్టాలని అమెరికా విదేశాంగ మంత్రి ఒత్తిడి తేవడం జరిగింది. ఇరాన్‌తో గ్యాస్‌ పైప్‌లైన్‌ ఒప్పందాన్ని పక్కకు పెట్టడంతో ఇరాన్‌ను మరింతగా ఒంటరిపాటు చేయాలని అమెరికా కోరుకుంటోంది. అలాంటి ఒత్తిళ్ళను ప్రతిఘటించాలని పొలిట్‌బ్యూరో పేర్కొంది. డబ్ల్యుటిఓపై దోహా విడల చర్చలను ప్రస్తావిస్తూ వ్యవసాయం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై భారత్‌ తన వైఖరిని విడనాడాలనే ఒత్తిళ్ళకు తలొగ్గరాదు. కర్బన కాలుష్యాలను తగ్గించడానికి అభివృద్ధి చెందిన దేశాలు ఏమీ తీవ్ర చర్యలు తీసుకోకుండానే భారత్‌ను తగ్గించాలంటున్న వాతావరణ మార్పు చర్చల్లో అమెరికా డిమాండ్‌ను అంగీకరించరాదు. ఈ ఏకపక్ష సంబంధాన్ని పటిష్టపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకించాల్సింది  Thursday, July 9, 2009

  ప్రణబ్‌ బడ్జెట్‌ అసలు రంగు

  2 వ్యాఖ్యలు
  వాస్తవం ఏమంటే ఈసారి బడ్జెట్‌ తాను చెప్పదలుచుకున్న దాన్ని సూటిగా చెప్పలేదు. వాటన్నింటికీ ముసుగు వేసింది. పైగా తన బడ్జెట్‌ అంతా సాధారణ ప్రజల కోసమే అన్నట్లుగా పోజు పెట్టింది. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాలకు, సామాజిక రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించానని చెప్పింది. దానికి మొట్టమొదటి ఉదాహరణగా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత ఏడాది బడ్జెట్‌ కేటాయింపు కన్నా 140 శాతం అధికంగా కేటాయించినట్లు ఘనంగా చెప్పుకుంది. 2008-09 బడ్జెట్‌లో గ్రామీణ ఉపాధి పథకానికి రు.14,400 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు దాన్ని రు.39,100 కోట్లకు పెంచారు. ఇలా చెప్పడం ప్రజలను దారుణంగా మోసం చేయడమే. ఇప్పటికే 2008-09 లో సవరించిన అంచనాల ప్రకారం రు.36,750 కోట్లు ఖర్చు పెట్టింది. దానిపై అదనంగా కేటాయించింది రు.2,350 కోట్లు మాత్రమే. శాతంగా చూస్తే అది నామ మాత్రమే. పైగా దినసరి కూలి రు.80 నుండి రు.100 కి పెంపు సైతం ఈ పెంపుదలకే పరిమితమయింది.

  పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఆహార భద్రత అంశంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. ఆహార భద్రత కోసం ఒక చట్టాన్నే తీసుకొస్తున్నట్లు బడ్జెట్‌ ముందు కాంగ్రెస్‌ పార్టీ హడావిడి చేసింది. కాని ఇప్పుడు దాని ముసాయిదా వ్యవసాయ, ఆహార మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఉంది చూసి అభిప్రాయాలు చెప్పండని ఆర్థికమంత్రి సెలవిచ్చారు. ఈ ముసాయిదా చట్టరూపంలోకి ఎప్పుడు మారుతుందో, దాని తుది స్వరూపం ఎలా ఉంటుందో?

  పేదరిక రేఖ దిగువన ప్రతి కుటుంబానికి నెలకు 25 కేజీల చొప్పున, కేజీ రు.3కు తిండి గింజలను అందజేేయాలన్నది ఈ బిల్లు లక్ష్యమని చెబుతున్నారు. కాని ఇప్పుడు కేంద్రం పేదల్లో పేదలకు అంత్యోదయ కార్డు ద్వారా కుటుంబానికి 35 కిలోల బియ్యాన్ని కేజీ రు.2 చొప్పున ఇస్తున్నది. నూతన పథకం అమల్లోకి వస్తే ఈ అంత్యోదయ కార్డు హోల్డర్లకు కోటాను 25 కేజీలకు తగ్గిస్తారా, ధరను కేజీకి రు.3కు పెంచుతారా అన్న సందేహాలు భయపెడుతున్నాయి. పైగా అనేక రాష్ట్రాలలో పేదలకు కిలో రెండు రూపాయలు, కిలో రూపాయి బియ్యం పథకాలు అమల్లో ఉన్నాయి. కేంద్రం కొత్త పథకంతో వీటి తీరుతెన్నులు ఎలా మారతాయి అన్న విషయం కూడ అర్థం కావడం లేదు. నిజంగా ప్రజలకు ఆహార భద్రత కల్పించాలంటే ప్రస్తుతం అమల్లో ఉన్న లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ స్థానే సార్వత్రిక ప్రజాపంపిణీని ప్రవేశపెట్టాలి. కాని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదు.

  ప్రపంచంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న బాలల్లో సగం మంది మన దేశంలోనే ఉన్నారు. ఈ పరిస్థితిలో వారికి ఎంతో కొంత ఆహారాన్ని సమకూర్చేది సమగ్ర శిశుఅభివృద్ధి పథకం (ఐసిడిఎస్‌). ఇలాంటి పథకం దేశవ్యాపితంగా అందరు బాలలకు అమలు కావడం లేదు. దీన్ని సార్వజనీనం చేయాలని సుప్రీం కోర్టు మూడేళ్ల క్రితమే ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా ఇప్పటికీ అమలు జరగలేదు. దీనికోసం కనీసం రు.12,000 కోట్లు ఏడాదికి అవసరం అవుతాయని అంచనా. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కేటాయించింది సుమారు రు.6,000 కోట్లు మాత్రమే. అందరికీ అమలు చేయాలన్న లక్ష్యాన్ని 2012లో చేరతామని మాత్రం బడ్జెట్‌లో చెప్పారు.

  విద్యారంగం పరిస్థితీ ఇదే విధంగా ఉంది. విద్యాహక్కు బిల్లు పార్లమెంటులో ఆమోదానికి సిద్ధంగా ఉంది. దీని ప్రకారం 14 ఏళ్ల లోపు బాలలందరికీ స్కూలు విద్య తప్పనిసరిగా అందించాలి. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించదు. ఎలిమెంటరీ విద్యకు ఈ ఏడాది కేటాయింపులను రు.19,488 కోట్లనుండి రు.19,682 కోట్లకు మాత్రమే పెంచింది. సెకండరీ విద్యకు కొంచెం మెరుగ్గా రు.2,000 కోట్లు అదనంగా కేటాయించింది. కాని ప్రభుత్వం అసలు మోజు ఉన్నత విద్యపైనే ఉంది. దాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది బేరానికి పెట్టాలని ఉబలాటపడుతున్నది. ఈ రంగానికి కేటాయింపులను రు.6,800 కోట్లనుండి, రు.9,600 కోట్లకు పెంచింది. వ్యవసాయ రంగంలో అభివృద్ధిని బాగా పెంచాలని చెప్పిన బడ్జెట్‌, కేటాయింపులను మాత్రం ఆ విధంగా పెంచలేదు. గత బడ్జెట్‌తో పోల్చుకున్నపుడు ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెంపుదల రు.1500 కోట్లు మాత్రమే. వ్యవసాయ, సహకార రంగాలకు కలిపి ఈ బడ్జెట్‌లో రు.11,307 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఈ కేటాయింపులు రు.9,600 కోట్లు. వ్యవసాయాన్ని ఎత్తి కుదేస్తానంటున్న ప్రభుత్వం వ్యవసాయ పరిశోధనకు కేటాయింపును రు. 2,960 కోట్ల నుండి, రు.3,241 కోట్లకు అంటే కేవలం రు.281 కోట్లు మాత్రమే పెంచింది.

  రైతులు వ్యవసాయం చేయడానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు లాంటి పెట్టుబడులను సక్రమంగా అందించడానికి, పండిన పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకునే ఏర్పాట్లను ప్రభుత్వం చేయాల్సి ఉంది. దాని గురించి ఈ ప్రభుత్వానికి పట్టినట్లు లేదు. రైతులకు బ్యాంకులు రుణాలు ఉదారంగా ఇవ్వాలని మాత్రం ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. కాని అసలు ఎలాంటి వ్యవస్థాగత రుణాలు అందని రైతులు కనీసం 40 శాతం ఉన్నారన్న సంగతి ఆయన మరచిపోయారు. రైతులకే నేరుగా ఎరువుల సబ్సిడీ అందిస్తామన్న పేరుతో ఉన్న వెసులుబాటుకే మంగళం పాడే ప్రయత్నాలు చేస్తున్నది.

  పేద, సాధారణ, మధ్యతరగతి ప్రజానీకం అన్నింటికన్నా ఎక్కువ బాధపడుతున్నది అధిక ధరల తాకిడితో. ధరలను అదుపుచేయడానికి ప్రభుత్వం
  ఎలాంటి చర్యలూ ప్రకటించలేదు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగాయన్న పేరుతో బడ్జెట్‌కు కొద్ది రోజుల ముందు పెట్రోలు, డీజిలు ధరలను పెంచి కూర్చుంది. పెట్రోలు, డీజిలు ధరలను అంతర్జాతీయ ధరలతో సంపూర్ణంగా అనుసంధానం చేయడం లక్ష్యంగా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఇంధనం ధరలు పెరిగితే వాటి ప్రభావం మిగతా అన్ని ధరలపైనా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

  ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థ్ధిక సంక్షోభం ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపైనా పడింది. ఎగుమతి ఆధారిత పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. పారిశ్రామిక రంగంలో సుదీర్ఘకాలంగా ప్రతికూల అభివృద్ధి నమోదవుతున్నది. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరి సంఖ్య 50 లక్షల వరకు ఉంటుందని అంచనా. వీరికి ఉపాధి కల్పించడం గురించి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనిపించదు. ఈ ఏడాది బడ్జెట్‌ వ్యయం మొత్తం రు.10 లక్షల కోట్లు దాటినప్పటికీ, దానిలో ప్రణాళికా వ్యయం కేవలం రు. 3 లక్షల కోట్లు మాత్రమే. అంటే అత్యధిక భాగం అనుత్పాదకంగా ఖర్చవుతున్నది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని సైతం కాదని ద్రవ్య లోటును జిడిపిలో 6.8 శాతానికి పెంచారు. ద్రవ్యలోటు రు.4లక్షల కోట్లకు పైగానే ఉంది. ప్రణాళికా వ్యయాన్ని మించి ద్రవ్యలోటు ఉంది. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ఆదాయాన్ని సమకూర్చుకొని దాని అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టాలి. అది చాలనపుడు లోటు బడ్జెట్‌కు పాల్పడి, ఆ నిధులను ఉత్పాదకంగా ఖర్చుపెట్టవచ్చు. కాని ఇప్పుడు ప్రణాళికేతర వ్యయానికి సైతం లోటు బడ్జెట్‌పై ఆధారపడాల్సిన దుస్థితిలో ప్రభుత్వం ఉంది.


  ఉన్నత స్థాయి కార్పొరేట్‌ ఉద్యోగులు, సిఇఓలకు పన్ను పరిధిలోకి రాకుండా సమకూర్చే వేతనేతర సదుపాయాలను ఫ్రింజ్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అంటారు. ఇలాంటి వాటిపై పన్ను ఎత్తివేసినా కార్పొరేట్‌ వర్గం సంతృప్తి చెందలేదు. బడాపెట్టుబడిదారులు ప్రభుత్వంపై కినుక వహించిన ప్రధాన అంశం ఒకటుంది. అది ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ఎంత మేరకు అమ్మనున్నారన్న విషయాన్ని ఈ బడ్జెట్‌లో స్పష్టంగా ప్రకటించకపోవడం. ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని సందేహానికి తావులేకుండా మరుసటి రోజు వివరించారు. ప్రభుత్వ రంగ వాటాల అమ్మకం గురించి ప్రకటించడానికి బడ్జెట్‌ తగిన చోటు కాదని, అయినప్పటికీ ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వం 51 శాతం వాటాలను మాత్రమే అట్టిపెట్టుకొని మిగతా వాటిని 'ప్రజల భాగస్వామ్యం' కోసం అందుబాటులో అంటే అమ్మకానికి ఉంచుతామని ప్రణబ్‌ ముఖర్జీ స్పష్టం చేశారు. బడ్జెట్లో అన్నీ ప్రకటించకూడదన్న వైఖరి వివిధ కీలక రంగాలలో ఎఫ్‌డిఐని అనుమతించడానికీ వర్తిస్తుందని భావించవచ్చు. ఎఫ్‌డిఐ ప్రస్తావనే బడ్జెట్‌లో లేకపోవడం పట్ల కొంతమంది ఆశ్చర్యం ప్రకటించారు. వాణిజ్య వర్గాలు కార్పొరేట్‌ పన్ను రేటును తగ్గించమంటుంటే, దానికి బదులు మినిమమ్‌ అల్టర్నేట్‌ టాక్స రేటును 10 నుండి 15 శాతానికి పెంచడం పట్ల కార్పొరేట్‌ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

  ఏం చేసినా మొత్తం ప్రత్యక్ష పన్నుల రాబడిలో నికర పెరుగుదల ఏమీ లేదని బడ్జెట్‌లో ప్రభుత్వం చూపించింది. ఆదాయపు పన్ను గరిష్ట పరిమితిని రు.2లక్షలకు పెంచాలన్నది న్యాయబద్ధమైన డిమాండు కాగా కేవలం రు.10 వేలు మాత్రం పెంచి రు.1,60,000లకు ప్రభుత్వం సరిపుచ్చింది. 2 లక్షలకు పెంచితే క్రిందిస్థాయి ఉద్యోగులు లాభపడతారు. దీనికి బదులుగా ఆదాయపు పన్నుపై అందరికీ వర్తించే సర్‌చార్జీని మాత్రం తొలగించింది. ప్రభుత్వం ప్రకటించిన మార్పుల ప్రకారం రు.2లక్షల వార్షికాదాయం లభించే వ్యక్తికి కేవలం రు.1,030 రాయితీ లభిస్తే, రు.50 లక్షల ఆదాయం వచ్చే వ్యక్తికి రు.1,45,745లు రాయితీ లభిస్తున్నది. ఆదాయపు పన్ను రేట్లలో మార్పు ద్వారా ప్రభుత్వం ఎవరిని ఆదుకోవాలనుకుంటున్నదో ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. మొత్తంగా బడ్జెట్‌ సాధారణ ప్రజలకు ఏదో ఒరగబెట్టినట్లు చూపాలని ప్రయత్నించింది. కానీ, ఆయత్నాలేవీ ఫలించలేదు. తన అసలు ఉద్దేశాలు అమలు చేయడానికి బడ్జెట్‌ సరైన చోటుకాదని ప్రభుత్వం చెప్పడం పట్ల పెట్టుబడిదారులు సంతృప్తి చెందుతారు. వారు ఆశిస్తున్న రాయితీలు తప్పక పొందుతారు. ప్రజలు మాత్రం అదనపు భారాలకు సిద్ధం కావలసి ఉంటుంది.