వీలుంటే నా నాలుగు లంకెలు ...

Thursday, April 7, 2011

సత్య సాయిబాబా ట్రస్ట్/ఒకరిద్దరు రాష్త్ర మంత్రుల చరలో/కబంద హస్తాలలో బందీగా వున్నారా?


నాకు బాబాగారి మహిమలు మరియు వారి దైవత్వము మీద యించైనా నమ్మకము లేదు. అయితే వారిగొడవ మనకెందుకులే అనుకుందామంటే కుదరడం లేదు, నాకు మీడియా ఫోబియా మరి. మన మీడియా ఎప్పటిలాగే ఈ వార్తను హైజాక్ చేసేసింది వాళ్ళ రేటింగ్స్ కోసమని. ఫుంకాలు ఫుంకాలుగా కథానాలు ప్రసారం చేసెస్తున్నాయి అసలు విషయం ప్రక్కనపెట్టి.

అసలు విషయంపై నాకో సందేహము కలుగుతోంది. రోగి ని (వారిని నమ్మిన వారికి 'రోగీ అని సంభోదిస్తే కోపమొస్తుందేమో! కాని వైద్యులు చికిత్స చెస్తున్నందున మరియు రోగ నిర్దారణ జరగడం వలన మెడికల్ సైన్స్ పరి భాషలో రోగి అనడంలో తప్పులేదు అనుకుంటా!) ఎవ్వరకి చూపించకపోవటం చేత  (మన ముఖ్యమంత్రికి సైతం) వారు  ట్రస్ట్/ఒకరిద్దరు రాష్త్ర మంత్రుల  చరలో  కిడ్నప్/కబంద హస్తాలలో బందీగా వున్నారా అనే ధర్మ సందేహము కలుగుతుంది. ఇది నాఆరోపణ కాదు, కేవలం నా సందేహము మాత్రమే. ఎందుకంటే, ఈవ్యవహారం సుమారు నలభై వేల కోట్ల రూపాయల ట్రస్ట్ ఆస్తులకు వారసత్వముతో ముడిపడివుంది.
సందేహాలకు కారణాలు..
1. క్యాబినేట్ మంత్రులు ఇద్దరు అక్కడే తిష్టవేసారు. ఓకరేమో వారి ఆరోగ్యం కుదిటపడింది అంటారు, యింకొకరేమో యింకా వారి ఆరోగ్యం ఆందోళనకరంగానే వుందంటారు ఒకే సమయంలో.
2. పొంతన లేని అనుమానస్పదపు మెడికల్ బులిటెన్లు.
3. కానరాని ట్రస్ట్ సభ్యులు.
4. రెండు లారీల పూలు తెప్పించారని, స్టేడియంలో  వేదికతో పాటు మెటల్ బారికేడ్లు మరియు స్టేడియంకి "లోపలకి", "వెలుపలకి" ద్వారాలు సిద్ధం చేసారాని మీడియాలో కథనాలు.
5. పొంతనలేని వాదనలతో వారి శిష్యరిక బౄందం, బాబాగారు అతను చెప్పినట్లే 95 సంత్సరాలు బతికే వుంటారు అని కొందరు, లేదు వారికి ఈ మానవజాతి దేహం ఏప్పుడు కావాలంటే అప్పుడు వదిలే అవకాశం వుంది అని మరికోందరు.
6. ముఖ్యమంత్రి గారు పుట్టపర్తి వెళ్ళడానికి చాల హడావిడి చేసారు, కాని వెళ్ళడం రద్దయింది, కారణం మాత్రం చెప్పలేదు.
7. మీడియాను అనుమతించక్కర్లేదు, కనీసం బాబాగారి ప్రస్తుత ఫోటోగాని, వీడియో గాని విడుదల చేయకపోవడం. ఫోటోలు,విడియోలు వల్ల వైరస్ సోకదు. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు జరిగినప్పుడు లైవ్ విడియోలు కుడా తీస్తుంటారు.


నా సందేహము ఏమిటంటే, ట్రస్ట్ ఆస్తిపాస్తుల/పంపకాల వ్యవహారం తేలేవరకు, ప్రభుత్వం లోని పెద్దలు గాని ట్రస్ట్ సభ్యులుగాని ప్రస్తుత బాబా గారి మంచి/చేడు చెప్పరేమో?

బాబాగారు కూడా ఎవరు కాదన్నా అవునన్నా మానవ దేహం కలిగి వుండటం చేత, రాష్ట్రంలో ఒక రొగి ఆరోగ్యం/భద్రత  పై యింత గందరగోళం జరుగుతుండటం వలన మానవ హక్కుల సంఘం స్వచ్ఛందం (సుమొటో)గా కేసు తీసుకొని, అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని  ప్రస్తుత యథార్ద స్థితిని తెలపమని కోరితే, వారి భక్తులకు, వారి దేహ సమకాలికులకు సందేహము నివౄత్తి చేసినట్లువుతారు.

ఏదిఏమైన, వారు కోలుకోని ప్రజలకు కనబడాలని ఆశిద్దాం.

9 comments:

 1. సత్యసాయి బాబాకీ, ఇతర ట్రస్ట్ సభ్యులకీ మధ్య డబ్బు విషయంలో విబేధాలు వచ్చి ఉంటాయి. మంత్రాలు & మహిమల పేరుతో సత్యసాయి బాబా చేస్తున్నది మోసమే కానీ అందులో అతనొక్కడే భాగస్వామి అనుకోను. సాయిబాబా బతికి ఉంటేనే అతని వెనుక ఉన్నది ఎవరో తెలుస్తుంది. ఈ పరిస్థితిలో సాయిబాబా త్వరగా కోలుకోవడమే మంచిది.

  ReplyDelete
 2. @ప్రవీన్
  అదేకదా సందేహం! అన్ని వసతులు అంతమంది బాగోగులు చుసుకొనే శిష్య బౄందం, అలోపతి డాక్టర్ల బౄందం మరియూ బాబా గారి దివ్య థౄష్టి వుండి కూడా, ముందుగానే రోగము ముదరకముందే గుర్తిచకపోవడమే విస్మయాన్ని, సందేహాన్ని కలిగిస్తుంది. బాబాగారి భక్తులంతా శిష్య బౄందాన్ని, ట్రస్ట్ సభ్యులను నిలదీయాలి ఈవిషయం పై.

  ReplyDelete
 3. డబ్బున్నవాళ్లు చిన్న వ్యాధికే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకి వెళ్తారు. 1980లలోనే 1500 కోట్ల ఆస్తులు సంపాదించిన సాయిబాబా తన ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేశాడంటే నమ్మశక్యంగా లేదు.

  ReplyDelete
 4. బాబా దైవత్వం మీద నాసిరకం నాస్థిక కమ్యూనిస్ట్ ఎదవలకే ఎక్కువ చింత. ఎంగిలి విస్తరాకుల్లాంటి వీళ్ళు గాలివాటానికి ఎగిరి ఎవరిమీద పడతారో తెలియని పరిస్థితి. ఏమాత్రం బుర్రలో గుజ్జు వున్నా వీళ్ళు బాబాని దేవుడా అంటూ అడుగుతూ, ఆవిషయాన్నే పదే పదే ఎత్తిచూపటం ద్వారా చేసే ప్రచారం వీళ్ళ దివాళాకోరు సిద్ధాంతాలు తెలియజేస్తున్నాయి. పనికిమాలిన ఎదవలు. ఆయన చేసిన సమాజసేవ కాదు అనే ధైర్యం ఈ ఎదవ కంపు నోళ్ళకు లేదు. ఇలా పోస్టర్ల మీద పేడ వేసుకుని బ్రతికేస్తున్న నీచ నికృష్ట బ్రతుకులివి, థూ మీ కుళ్ళునోర్లు పడిపోను. మీ పిండాలు కుక్కలెత్తుకెళ్ళ.
  జీవితంలో ఒక్క పైసా సమాజం కోసం దానం చేయని ఎదవలు కూడా స్టేట్మెంట్లిచ్చేవాళ్ళేనా? నీలాంటి ఎంగిలివిస్తళ్ళు నమ్మితే ఎంత, నమ్మకుంటే ఎంత?

  ReplyDelete
 5. ఏదీ చెయ్ చూద్దాం. ఫారినర్స్ కాదు కదా సీకోలంలో బడిపిల్లలు కూడా నిన్ను నమ్మరు. రాళ్ళుచ్చుకుని తరుముతారు.

  ReplyDelete
 6. @Anonymous:
  నాకు కలిగిన సందేహమునకు ఈ అజ్ణాతి దగ్గర సమాధానం లేదు. అందువలన, ఇతనికి వ్యక్తిగత దూషణ తప్ప వేరే దారి లేదు. యిటువంటి రాతలు వ్రాసేటప్పుడు తల్లితండ్రులు పెట్టిన పేరునుకూడా వాడటానికి అనర్హుడే! అందుకే "అజ్ణాతి" పేరుతో వ్యాఖానించాడు.
  బహుశా ఈ అజ్ణాతి నమ్మిన ఆస్థికవాదము (సత్య సాయిబాబా, రకరకాల మతాలు, వగైరా), ప్రస్తుత ఈ గొప్ప సమాజము (పెట్రొల్ కోసం ఊచకోత కొసే ఆమెరికా, హద్దులు లేని ఈ అవినీతి కాంగ్రేస్, మత విద్వేషమే అధికారంగా బిజేపి, వగైరా) నేర్పించిన జ్ణానము ఇదే!
  వాడిన భాషా ప్రావీణ్యము అతని సంస్కౄతికి అద్దంపడుతుంది.

  ReplyDelete
 7. అడుక్కు తినే బిచ్చ గాడికి ఈ బురిడీ బాబాకి ఏమి తేడా లేదు. ఎవడన్న సంపాదించి చేస్తే దానం అంటారు. అడుక్కొని చేస్తే అనర్ర అంట్ల వెధవ.
  వీడు నోట్లోంచి లింగాలు తీసి,ఈ బురిడీ బాబా చెప్పే మాటలకి భక్తులయి పోయిన వాళ్ళని అనాలి అసలు.

  ReplyDelete
 8. దేవుని మీద నమ్మకం ఉండటం మంచిదే, కాని మూఢ నమ్మకం ఉండకూడదు. సత్య సాయి ఎన్నో మంచి పనులు చేసినందుకు వ్యక్తిగతంగా అతనిపై అభిమానం ఉండొచ్చ్హు కాని అతనే దేవుడని నమ్మితే ఇక నేనేమీ చెప్పలేను ఎర్రగడ్డ ఆస్పత్రి చిరునామా ఇవ్వటం తప్ప. అయినా ఇందులో మన భారతీయుల తప్పు కూడా ఉంది. ఏవరికైనా సాయం చెయ్యండ్రా అంటే మొహం కూడా చూడరు. "నెను దేవుణ్ణి నన్ను నమ్మితే ఇదుగో అరచేతిలో వైకుంఠం" అంటే కాళ్ళమీద పడిపోతారు. ఖర్మ ఖర్మ.

  ReplyDelete
 9. దొంగ డాక్టర్ నాదెండ్ల ఏదో తప్పొప్పులు అంటున్నాడూ

  ReplyDelete