వీలుంటే నా నాలుగు లంకెలు ...

Thursday, April 7, 2011

శ్రీ సత్యసాయిబాబా - సగటుమనిషి సంవేదన! - ఈ టపాకు సమాధానం....

హవ్వ హవ్వ! ఆడలేక మద్దెలదరువు అన్నట్లు.

శ్రీ సత్యసాయిబాబా - సగటుమనిషి సంవేదన! (Click here) ఈ టపాకు సమాధానం....

మీ టపా సాయిబాబా గారి ప్రస్తుత పరిస్థితి గురించి రాసారు. మీరు రాసిన దానిపైన మాత్రమే కామెంట్స్ వ్రాసాను. కొన్ని సందేహాలు తెలిపాను...
బాబాగారి శరీరం ఇప్పుడు కష్టంలో వుందా? లేక శిష్య బృందం చెపుతున్నట్లు డాక్టర్ల పరిజ్ఞాణాన్ని పరీక్షీంచుతున్నారా? బాబాగారు పెట్టిన ఈ పరక్షలో (జగన్నాటక సూత్రదారి కదా) డాక్టర్లు నెగ్గుతారా? నెగ్గరా? నెగ్గితే ఏమవుతుంది? నెగ్గగపోతే ఏమవుతుంది?
పైదానికి సమాధానము చెప్పటనికి ఇప్పటివరకు సాహసించని మీరు, ఈ విషయంతో ఏటువంటి సంబందం లేని ఎవరో మధ్యలో వచ్చి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితేనే నేను అడిగినదానికి సమదానం ఇస్తను అంటున్నారు.  దీనిని విషయ దాటవేత దొరణి కాక మరేమంటారు?
>>> పైన నే ఉదాహరిచిన నవీన మూఢనమ్మకాలమీద మీరే౦ పోరాటం చేసారో చెప్పండి?
ఇక్కడ చర్చలో పాల్గోన్నవారంతా వారు నమ్మిన సిద్ధాంతాలపై పోరాటాలు చేసినవారైనా? ఇదేమైన ఈ వేగుకు కండిషన్ వుందా? మీరు వేసిన టపాకు ఈ ప్రశ్నకు  ఏమైన సంబదం వుందని భావిస్తున్నారా?
>>>ఆస్థికత్వం/దేవుడుల ప్రసక్తి లేకుండా తమకంటూ ఓ సిద్ధాంతం రూపొందిచ్చుకోవచ్చు
వరెవ్వ! ఎంత తెగింపు? ఆస్థికులంతా సాయిబాబాని కలియుగ దేవుడుగా నమ్ముతున్నట్లు మీరు ఎలా నిర్దారణకు వచ్చారు? సాయిబాబా చెడుని వేలెత్తి చెబుతున్నవారంతా నాస్తికులేనా?

దీనిని విషయ దాటవేత దొరణి కాక మరేమంటారు?

11 comments:

 1. గూగుల్ బజ్‌లోనూ ఇలాంటి ప్రశ్నలే అడిగారు. ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తోన్న కోకాకోలాని ఎందుకు వ్యతిరేకించడం లేదు, సాయిబాబానే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అని అడిగారు. నేను ఎన్నడూ కోకాకోలాని సమర్థించలేదు. నాకు ఆ ప్రశ్న అడగడం ఏమిటి? అది వాళ్లు వ్రాసిన టాపిక్‌కే సంబంధం లేని ప్రశ్న. అయినా నేను ఇంతకుముందు కోకాకోలాని విమర్శిస్తూ వ్రాసిన టపా యొక్క లింక్ చూపించాను.

  ReplyDelete
 2. http://sukthisudha.blogspot.com/2011/04/blog-post_6857.html

  మీకు సమాధానం రాసాను చుడండి నా బ్లాగ్ లో.

  ReplyDelete
 3. meeru chinnappuDu paTigaDDa kaalani lO unDEvaaraa???
  raaju gaaru meeku emeinaa avutaaraa?
  satyavatikondaveeti@gmail.com

  ReplyDelete
 4. meerandaroo ilaa kottukuntunte painunchi evadu choostunnaadO atane bhagavantudu :)

  ReplyDelete
 5. నేను గూగుల్ బజ్‌లో ఈ టాపిక్ వ్రాసాను https://profiles.google.com/praveenmandangi/posts/bZK8VjjNNJD రాజేశ్ ఏమో అక్కడ ఆహార పదార్థాలలో మత్తు మందులు గురించి నాస్తికులు పట్టించుకోవడం లేదు అంటూ వ్రాసాడు. ఒకవేళ మనమే అలాంటి కామెంట్లు వ్రాస్తే సంబంధం లేని కామెంట్లు వ్రాస్తున్నామని వాళ్లే అంటారు.

  ReplyDelete
 6. ఓ నాస్థిక శుంఠాగ్రేశ్వర చక్రవర్తుల్లారా, బాబా అన్నది తను భగవంతుడైతే మీలోనూ భగవంతుడున్నాడు అని. మీలాంటి శుంఠల్లో కూడా భగవంతుడున్నాడంటే కొద్దిగా ఆలోచించతగ్గ విషయమే కాని వున్నాడని చూచాయిగా ఒప్పుకోవాల్సొస్తోంది.
  ఆయనకు నొప్పి వుందా?
  మీకు బుర్ర వుందా? ఏదీ తీసి చూపించండి.

  ReplyDelete
 7. వాసవ్య గారు, మీరు కామెంట్ మోడరేషన్ పెట్టుకుంటే మంచిది. గతంలో వీళ్లు జురాన్ అనే బ్లాగ్‌లో ఏమాత్రం సంబంధం లేని కామెంట్లు వ్రాసి చెత్త చేశారు.

  ReplyDelete
 8. Hello Vasavya: I just happened to go through your 4pages CV and you changed companies for every 1, 1.5year. On page3 under My Role 1st sentence is gramatically wrong. No need to be Milton or Tennyson Or Shakespere but should know basic English. Limit your CV to 2pages. Better not to dump whatever tech jargon you have come across. All the best.
  May God bless you. :)

  ReplyDelete
 9. @Anonymous
  Thanks for ur suggestions. That is very old CV. I supposed to removed my CV long back from my portal. At present I am working with my Own company. http://tagv.in.

  Thanks for ur wishes and I may need wishes from like you people for moral support in this society, not from unknown things.

  ReplyDelete
 10. వాసవ్య గారు, మీరో విషయం గమనించారో లేదో. బాబాల బండారం బయట పెట్టే టివి చానెళ్లే సత్యసాయిబాబ విషయానికి వచ్చేసరికి అతను దేవుడు అంటూ అందరూ పాడిన పాటే పాడుతాయి. ప్రజలలో బలంగా వేళ్లూనుకుపోయిన వ్యక్తిగత విశ్వాసాలని ధిక్కరిచే ధైర్యం రాదు వాళ్లకి. అందుకే సత్యసయిబాబాని ఒకలాగ, సాయి కాళేశ్వర్‌ని ఇంకొకలాగ చూస్తాయి మన టివి చానెళ్లు.

  ReplyDelete
 11. తెలకపల్లి రవి గారు వ్రాసిన "బాబాల బండారం" పుస్తకం చదివారా? అందులో సత్యనారాయణ రాజు సత్యసాయి బాబాగా ఎలా అవతారమెత్తాడో వ్రాసి ఉంది.
  http://literature.mlmedia.net.in/2010/03/2.html
  http://www.prajasakti.com/stage/article-106697

  ReplyDelete