వీలుంటే నా నాలుగు లంకెలు ...

Friday, April 8, 2011

సాయిబాబా పరిస్థితి పై HRC కలుగజేసుకోవాలి...

హెల్త్ బులిటెన్ తొ పాటు కనీసం వీడియో క్లిపింగ్స్ బయటపెట్టాలి!
 బాబాగారు కదలలేని ప్రస్తుత స్థితిలో ట్రస్ట్ సభ్యులు గాని మరెవరైనా నిర్భంధించే అవకాశము లెకపోలేదు (వేలకోట్ల రూపాయిల వ్యవహారమిది, బాబాగారు దేవుడని కోందరు నమ్మవచ్చు, కానీ ట్రస్ట్ సభ్యులందరూ దేవుళ్ళు కాదుకదా! వాళ్ళలో స్వార్ధపరులుంటే. ఏవో గోడవలని కూడావింటున్నాం). వీరు కల్పిస్తున్న అనవసరపు టెన్‌షన్‌ వలన వేలాది మంది పోలీసులు, మంత్రివర్యుల బస వంటి కారాణాలుచేత ప్రజాధణం ఖర్చవుతుంది కూడా.

దేవుడయినా కాకపోయినా సాయిబాబా మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి ఒక మనిషిని సమాజానికి కనబడకుండా అయోమయ్యానికి గురిచేస్తున్న పుటపర్తి కోటరీ పై రాష్ట్ర మానవ హక్కుల సంఘం (HRC) కలుగజేసుకోని అతని యోగ క్షేమాలు తెలిపి అనవసరపు రాధాంతాన్ని, అనవసరపు ప్రజాదనఖర్చును కాపాడాలి. అంతే కాకుండా అతని భక్తులకు కూడా మేలు చేసినవారవుతారు ఒకరకంగా.


16 comments:

 1. కరెక్టుగా చెప్పారు.. ఇంతమందిని ఆందోళనకు గురిచేయడాన్ని నివారించే మార్గమిదే...

  ReplyDelete
 2. ఆశ దొస అప్పడం వడ గారి...
  ఈ పరిస్థిలో బాబాగారిని చూబెడతారని గెట్లగనుకున్నావు అన్న. నగనగలాడె స్వామి వారి నల్ల జుట్టే స్వామి వారి భక్తులకు తెలుసు. 10రొజుల నుండి బెడ్ మీదవున్న బాబాగారిని ఇప్పుడేట్లాగ గుర్తుపట్టేది భక్తులు? జుట్టుకు రంగు పుసుకోనే టైం, ఓపికా వచిన తరువాత చూదాం లే!

  ReplyDelete
 3. మీప్రయత్నం ప్రశంసనీయం, అయితే మీరాబ్లాగులో చర్చిస్తే వృధాప్రయాసేగానీ బహుషా ఉపయోగమేమీ ఉండదు. వారికి నిజంగా వాస్తవాలు చర్చించే ధమ్మే ఉంటే బ్లాగర్లపై వెకిలి రాతలెందుకు రాస్తారు? మీరు రాయాలనుకుంది మీబ్లాగులో రాస్తే సరిపోతుందేమో.

  ReplyDelete
 4. @Anonymous:
  మీ సూచనకి ధన్యావాదాలు. వాస్తవాలపై చర్చకన్నా బ్లాగర్లపై వెకిలి రాతలకేవారు యిష్టపడుతున్నట్లున్నారు

  ReplyDelete
 5. Its foolish to expect something reasonable there.

  Happy blogging

  ReplyDelete
 6. *వాళ్ళక్రింద గులాంగిరి చేయ్యడానికి రెడీ (చేస్తూనే వున్నారు!). మన కాళ్ళమీద మనం నిలబడాలంటే వీలకు నచ్చదు యెందుకంటే ఎంగిలి డాలర్లకు కకుర్తిపడీ. *
  1 ఎంగిలి డాలర్ = 45 రుపాయలు. రూపాయకు కక్కుర్తి పడేవాడు 45రెట్లు దిగదుడుపనా మీ అర్థం? :)

  ReplyDelete
 7. దీనికి కొనసాగింపుగా(click) నా కామెంట్స్ రాజేష్ జి(click)దాచిపెట్టాడు ప్రస్తుతానికి!
  శ్రీకర్ గారు...
  మీ కామెంట్స్ చాలా బాగున్నాయ్! మీ వివరణ బాగుంది మిగతా బ్లాగర్ల వితండవాదన వెకిలి రాతులుగా కాకుండా. కాకపోతే మీవాదనతో నేను పూర్తిగా ఏకీభవించను అదివేరే విషయం.

  ఒకరిద్దరు కామెంటేటర్లు పరాయిదేశాన్ని నిసిగ్గుగా పొగుడుతూ మాతృ దేశాన్ని చిన్నచూపుగా, వెకిళి రాతలు (ఆమెరికా లేక పోతే మనము లేము అనేరీతిలో) వ్రాసిన వారికి జవాబు చెప్పకుండా మీలాంటి వారిలాగ వుండలేకపోయా! నా భావ ప్రకటనలో ఒక చిన్న పొరపాటు జరిగినది. కాకపోతే నా కామెంట్స్ మొత్తం ప్రవాసాంధ్రులందరికి వర్తిస్తాయి అని గమనించలేకపోయా. పరాయిదేశానికి వలస వెళ్ళడం తప్పుకాదు. వెళ్ళడం వలన లాభాలు వున్నాయి అదేవిధంగా నష్టాలు వున్నాయని వేరే చెప్పక్కర్లేదు. నావల్ల బాధకలిగిన ప్రవాసాంధ్రులందరికి క్షమాపణలు(కేవలం మాతృదేశఅభిమానులకు, ఆమెరికా కుటిలనీతిని రుర్తెరిగిన వారికి మాత్రమే).

  >>>పైన రాసినవి చదివిన తరువాత ఎవరి ప్రోత్సాహం తో ఎవరు హిందూ మతం మీద ఎవరు బురద జల్లుతున్నారో గమనించండి... మీరు హేతువాదులలో ఎటువంటి కేటగిరిలోకి వస్తారొ నాకు తెలియదు.. కెరీర్ ఇచ్చి ప్రోత్సహించటం లేదు. వారికి వారే స్వచ్చందం గా చర్చలో పాల్గోంట్టున్నారు
  ****
  నాకు ఏ సంఘంలోనూ సభ్యత్వం లేదు. ఆధారరహిత వాదన, మీరు ఊహించుకుంటుంన్నట్లు ఎవరూ నన్ను ప్రోత్సహించటంలేదు. డబ్బులూ యివ్వడంలేదు. అంటే మీభావాలకు వ్యతిరేకమయితే, స్పాన్సర్షిప్ కామెంట్స్ అనేనా మీ ఉద్ధేశం?


  >>>తీవ్రంగా విమర్సిస్తూ రాసే వారిలో నాకు తెలిసిన ఒకరిద్దరు గురించి చదవండి
  ****
  నీతులు చాలామంది చెబుతారు. ఆచరణలోకి వచ్చేసరికి చాలామంది తుస్సుమంటారు(ఏ వాదం చేసేవారైనా). ధైవత్వం నమ్మినవారు తప్పుచెయ్యరనా మీ ఉద్ధేశం? ఒకరెద్దరేమి లక్షలమంది వుంటారు. మా తాత ముత్తాతలు,తల్లితండ్రులు ఆస్థికులు, నేను భక్తుడను కాను. అంటే వారి ఆస్థికత్వం తప్పని దీని అధారంగా నిర్ధారించలేము కదా. అట్లానే పలానా వ్యక్తి కొడుకే ఇట్లా రాశాడు అట్లా రాశాడు అనే ఆధారంతో విమర్శించడం తగదు.

  >>>కాని బ్లాగుల్లో రాసేవారు చాలా దేశాలు తిరిగి, చూసి, ఎంతో ఆలోచించి ఒక విశాల దృక్పధం తో రాస్తున్నారని అని గమనించండి/తెలుసుకోండి.
  ****
  యిది అర్థరహితం. నేను కూడా చాలాదేశాలు చూశాను అని మీకు నిరూపిస్తే నా వాదనలన్నీ నిజమని మీరు ఒప్పుకుంటారా? విశాల దృక్పధం అనేది కేవలం యిప్పుడున్న కాలేజి చదువులతో 100% తెచ్చుకొని క్యాంపస్ లో సెలెక్టయినంత మత్రాన రాకపోవచ్చు. పెరిగిన వాతావరణం ముఖ్యం. ఎంత చదివారని, ఎంత సంపాదిస్తున్నారని, ప్రస్తుతం ఎక్కడవున్నరని కాదు. ఖండాంతరాల నుండి వచ్చే ప్రతీ వేగు విశాల దృక్పధం తోరాసేదేనా?


  >>>జపాన్ వర్సస్ అమెరికా హార్డ్వేర్ గురించి
  ఇక పవీణ్ అడిగినదానికి నన్ను సమాదానం అడుగుతున్నారు. ప్రవీణ్ మీకు తెలిసినంత కూడా నాకు తెలియదు. నా థృష్ఠిలో ఆమెరీకా అయిన, జపాని అయినా, చైనా అయిన, పాకిస్తాన్ అయినా ఒక్కటే! విశ్వశాంతి వర్ధిల్లాలి! దుర్మార్గం నశించాలి.

  ReplyDelete
 8. అమెరికా సామ్రాజ్యవాదం గురించి హేరీ మెగ్డాఫ్ & జాన్ బెలామీ ఫాస్టర్‌లు వ్రాసిన రచనలు చదివాను. జపాన్ హార్డ్‌వేర్ విషయం అంటారా? టెక్నాలజీని ఎవరైనా డెవెలప్ చేసుకోవచ్చు. టెలీఫోన్‌ని ఎడిసన్ కంపెనీవాళ్ళు కనిపెట్టారు. కానీ చిన్నప్పుడు మా ఇంటిలో బెంగళూరుకి చెందిన కంపెనీ తయారు చేసిన టెలీఫోన్ డివైస్ ఉండేది. ఎడిసన్ కంపెనీ తయారు చేసిన ఒరిజినల్ డివైస్‌కి డయలర్‌ని చేతితో తిప్పాలి. కొత్త రకం డివైస్‌లకి అలాంటి డయలర్లు ఉండవు. లక్కరాజు గారు చేస్తున్న వాదన విడ్డూరంగానే ఉంది. యునిక్స్ & సి ని అమెరికావాళ్ళు కనిపెట్టారు కాబట్టి హార్డ్‌వేర్‌ని కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలనడం జోక్.

  ReplyDelete
 9. *నా థృష్ఠిలో ఆమెరీకా అయిన, జపాని అయినా, చైనా అయిన, పాకిస్తాన్ అయినా ఒక్కటే! విశ్వశాంతి వర్ధిల్లాలి! దుర్మార్గం నశించాలి. *

  అలా మీరు చెప్పినది జరాగాలంటే ముందుగా మనం ఇతరులను గౌరవించాలి మరియు అర్థం చేసుకొని ప్రేమించాలి. ఇక్కడ మీరు ఒకటి మరచి పోతున్నారు. అది ఎమిటంటే మీలాంటి నాలంటి వారు, వ్యక్తులు సంఘం లో పంచుకోవలసినది, పెంచుకోవలసినది ఇతరుల పట్ల గౌరవాన్ని మరియు ప్రేమను. దానినే క్లుప్తం గా చెప్పాలంటే సంస్కృతి అంటారు. ఈ సంస్కృతి ని రక్షించటానికి మనం ప్రభుత్వాన్ని ఎర్పాటు చేసుకొన్నాం. రాజ్యంగం ద్వారా దానికి కొన్ని హక్కులిచ్చాం. ఈ గోడవ అంతటికి కారణం ప్రభుత్వం చేయవలసిన బాధ్యతను మనం దానికి గుర్తుకు చేస్తూ మనలో మనం గొడవ పడుతున్నాము. మీరు దీనికి అంతటికి కారణమైన ప్రభుత్వ వైఫల్యాన్ని వదిలి వేసి మనం గొడవ పడటం భావ్యం కాదు కనుక ఈ విషయం ఇక్కడితో వదిలి వేయండి. ఎందుకంటె మీరు నేను పోయి ఈ బాబా విషయం పై ప్రభుత్వానికి చెప్పి ప్రభావితం చేయలేము కదా! చేతనైనంత వరకు అభిప్రాయలు పంచుకొన్నాము. మనలో మనకు గొడవలు అనవసరం. ఇక బాబా గారిని మీరు ,నేను దేవుడనుకోకపోయినా. ఆయనని అందరిలాంటి వాడనుకొన్నా నా అభిప్రాయం మీరు ఈ క్రింది టపాలో చూడండి.
  http://ravigaru.blogspot.com/2011/04/blog-post.htmlh

  ReplyDelete
 10. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 11. *నీతులు చాలామంది చెబుతారు. ఆచరణలోకి వచ్చేసరికి చాలామంది తుస్సుమంటారు*
  మీరు మరీ ప్రతిదానినికి వివరణ కోరుతున్నారు. ప్రపంచంలో చాలా తగవులకు కారణం చాలా మంది నిజాయితి పరులవలనేమొ అనిపిస్తుంది. వీరు నిజాయితిని ఎక్కువగా నమ్మి తనకంటె ఎవ్వరు నిజాయితి పరులులేరనిపించుకోవాలని ఎక్కువగా తాపత్రయపడి ఇతరులతో గోడవలు పడుతూంటారు. ఎవరైనా ఒక చిన్నమాట అంటే తట్టుకోలేరు. తాట వొలిచేయాలని చూస్తారు. అదే కొంచెం అవినీతి పరులైతే ఈ రోజు సాయంత్రం ఎవరు మనకు పార్టి ఇస్తారు, వాడితోకల్సి పోయి బిల్లు వాడినెత్తిన వేసి ఊరికే మందు ఎలా తాగాలి అని ఇతరులతో ఎలా ఫ్రేండ్షిప్ చేయాలని ఆలోచిస్తూంటారు. అమ్మాయిలతో తిరిగే వారివలన, మందు తాగే వారివలన ఎప్పుడు ప్రపంచ యుద్దాలు రాలేదు. వారివలన విశ్వశాంతి వర్ధిల్లుతుంట్టుంది :-). కాని చాలామంది వారు చేదిపోతున్నారని బాధపడి పోతూంటారు. వారిని మంచి మార్గం వైపుకు మరల్చటానికి ప్రయత్నిస్తూంటారు. :-)

  ReplyDelete
 12. స్పాన్సర్షిప్ కామెంట్స్ అనేనా మీ ఉద్ధేశం?*

  కానే కాదు. ఎప్పుడో ఒక టపారాసే మీలాంటి వారుకాదు. కాని మనం ఇటువంటి వాదాలు చేయటానికి, మనం బాబాల మీద కొన్ని స్పష్ట్టమైన అభిప్రాయం రావటానికి కొన్ని పుస్తకాలు, పేపర్లో రాసే ఆర్టికల్స్ చదువుతాము కదా! ఆ రాసేవరిలో కొంతమందికి ప్రత్యేక కారణాలు ఉంటాయి. కొన్ని సార్లు వారి గురించి తెలియక చదువుకొని మనం మన చుట్టుపక్కల పరిస్థితిని వారు రాసిన కోణం లో మనకి తెలియకుండానే చూడటం మొదలు పెడతాము. పేపర్లో రాసింది కాని, పుస్తకంలో రాసింది కాని మనం మన ఎదురు మనుషులకన్నా ఎక్కువ నమ్ముతాం. దానికి కొన్ని కారణాలు ఉంటాయి మీ మిత్రుడే ఒక కొత్త అభిప్రాయం చెప్పాడనుకొండి దానిని విని మీరు ఆమిత్రుని నైజాన్ని బట్టి అర్థం చేసుకొంటారు లేక పోతే బేరీజు వేస్తారు. అదే పేపర్లో పుస్తకం లో, చదివితే మీ ఎదుట ఆవిషయం మీద రాసిన/చెప్పే వ్యక్తి వుండడు. ఇక్కడ అతని ఇంటేన్షన్స్ కాని అతని వ్యక్తిగత నడవడిక పరిగణలోకి తీసుకోరు. మీకు మీరే చదువుతారు కనుక దానిని మీరు చాలా మటుకు నమ్ముతారు. పేపర్, పుస్తకం ప్రచూరించే సంస్థ, రచయిత ను మీరు పూర్తిగా నమ్ముతారు. ఎందుకంటె వారిని నమ్మ బట్టే కదా ఆ పేపర్ని, పుస్తకాన్ని కొనుకున్నది. మీరు కొన్నారు అంటే మీకు వారి మీద విశ్వాసం ఉంది అని అర్థం కదా. వారిని అనుమానించటం అంటే మనల్ని మనం అనూఅనిచుకొనట్టే కనుక ఆపైని చేయలేదు. కాని నేట్ వలన తెలిసే వార్తలన మనం ఇప్పుడు మన పాత నమ్మకాలను ఇంకొకసారి తిరిగి పునహ్ సమీక్షించుకోవాలి. దీనికి కామన్ సెన్స్ చాలు ఎది నిజమో ఎది అబద్దమో అని తెలుసుకోవటానికి.
  ఇక అసలువిషాయనికి వస్తే ఇంతటి విశ్వాసాం వీరి పై ఎర్పడటానికి కారణం ఒకపుడు రచయితా అనే వాడు తాను వ్యక్తిగతం గా ఎలా జీవించాడో రచనలలో అదే ప్రతిబింపచేసేవాడు. వారు తమ గురించి దాచుకొని పెద్ద నీతులు చెప్పలేదు. అది శ్రీనాధుడైనా, చలం, త్రిపురనేని రామస్వామి, విశ్వనాథ ఐనా వారి బలాలు బలహీనతలు అందరికి తెలుసు. ఎక్కడా పెద్దగా దాపరికం లేదు. అదే విధం గా మన దేశంలో పేపర్ను మొదలు పెట్టినవారు స్వాతంత్ర రాటం లో భాగం గా దేశ హితం కొరకు వున్నవి లేని మొదలు పెట్టరు. ఈ మధ్య మీకు తెలుసుకదా కొంతమంది రచయితలు మునుపటి రచయితలా నిబ్బదత గలిగి లేరు. వారు డబ్బుకనో, పేరు ప్రఖ్యతులకనో , కేరిర్ కొరకు రాయటం మొదలు పెట్టారు. అలాగే పేపర్లలో ఎన్నొ మార్పులు చెంది ప్రస్తుతం పైడ్ న్యుస్ కూడా ప్రచూరిస్తున్నారు. అన్ని మార్పులు చెందుతున్నా ప్రజలు మొన్నటివరకు పెద్ద గా మార్పుచెందక వీరిని అంతా మంచి వాళ్ళంకొని పాత రోజుల్లో లాగా నమ్మేవారు. ఈ పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తున్నాది. నేట్ ద్వారా ఈ రోజులలో చాలా మంచి సమాచారం దొరుకుతున్నాది. కనుక దానిని కొత్త కళ్ళతో/దృష్టితో చూడవలసిన అవసరం వచ్చింది. అందరం మన పాత అభిప్రాయాలను, విశ్వసాలను మార్చుకొనేటందుకు సిద్ద్దంగా ఉండాలి. అప్పుడే మీరు కోరే విశ్వశాంతి వస్తుంది.

  ReplyDelete
 13. లక్కరాజు గారు చేస్తున్న వాదన విడ్డూరంగానే ఉంది. యునిక్స్ & సి ని అమెరికావాళ్ళు కనిపెట్టారు కాబట్టి హార్డ్‌వేర్‌ని కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలనడం జోక్.
  ----------
  నాయనా ప్రవీణూ నేను అలా అనలేదు. ఇక్కడ మేము రొటీన్ గ అన్నీ evaluate చేసి Hardware software combinations ఏవి తక్కువ ధర అయితే అవి కొనుక్కున్టాము ( prohibited దేశాలవి తప్ప).

  ReplyDelete
 14. శ్రీకర్ గారు,

  మీరు నాణేనికి ఒక వైపు మాత్రమే చెప్పారు. మీ ఉద్దేశ్య౦ బాబా గురి౦చి అద్భుత౦ అనివ్రాసినవారికి కూడా చె౦దుతు౦దా? ఇక అసలు ప్రి౦ట్ మీడియా మొత్తానికి చె౦దుతు౦దా?

  చదవగానే గుడ్డి గా నమ్మేసే వారు అసలు చర్చి౦చరు అనుకు౦టాను.

  ఇక అన్ని కోట్ల తో జలయజ్ణ౦, ఇ౦దిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ, పేదవిద్యార్ధుల ఫీజులు..ఇలా ఎన్నో చేసిన 'రాజ శేఖర్ రెడ్డి బాబా' కి సత్య సాయి బాబా కి గిట్టని వారు అవినీతి ని అ౦టగడుతున్నారు కదా :)

  ReplyDelete
 15. Mauli గారు,
  నేను ఇంత పెద్ద వివరణ ఇస్తే దానిని నాణ్యనికి ఒక వైపు అని ఒక చిన్న మాట అనేశారు. నేను ఇచ్చిన ఇంత పెద్ద జావాబు సమాధాన పరచలేక పోతే ఇవ్వబోయేది ఎలా మిమ్మల్ని కన్వీన్స్ చేయగలదో చెప్పండి? ఇటువంటి ప్రశ్నలకి సమాధానం ఎవరికి వారు వెతుక్కోవాలి. మీరు నా సమాధానం నాణేనానికి ఒక వైపు అనే చెప్పే ముందర మీకు తెలిసిన ఆమరొక వైపు గురించి "ముందుగా" మీరే వాసవ్య కు గాని,రాజేష్ గాని చెప్పి ఉంటే/ వివరణ ఇచ్చి ఉంటే నాకు ఎంతో శ్రమను తగ్గించిన వారై ఉండేవారు. వారు ఇంతగా వాదోప వాదాలుఇ చేసుకొని ఉండక పోయేవారు. నేను యిక్కడ ఇచ్చిన వివరణ ఎక్కడనుంచో కాపి పేస్ట్ చేసినది కాదు. ఏన్నో జీవితాలు చూసి, పుస్తకాలు చదివి నా అనుభవం నుంచి నేను నేర్చుకొన్నది. అనుభవం నుంచి నేర్చుక్కొన్నవి మాత్రమే కాల పరిక్షలో నిలబడాతాయి. అందువలననే నేను ఇచ్చిన సమాధానాలు వాసవ్య ఏకీభవిస్తూ కొన్నింటికి విభేదించాడు. మిగతావి అలా చదివి ఇలా మరచి పోతాం.
  చిన్నపటి నుంచి రోజు పేపర్ చదువుతాం, పుస్తకాలు చదువుతాం కదా! మీకొచ్చిన సందేహాల పైన మీరు ఎన్ని సార్లు వారిని (పేపర్ ఎడిటర్ కాని, పుస్తక రచయిత కాని) ప్రశ్నించి ఉంటారు? ఒకవేళ ప్రశ్నించినా వారు ఎన్ని మార్లు మీ ప్రశ్నలకు జవాబిలిచ్చారు? ప్రశ్నించక పోయి ఉంటే ఎందుకు ప్రశ్నించలేదో మీరు మిమ్మల్ని ఒకసారి ప్రశ్నించుకోండి.

  బాబా మీద యింఫర్మేషనే కావాలంటే ఎన్నో ఆర్టికల్స్ నేట్ లో ఒక చిన్న సర్చ్ చేస్తే దొరుకుతాయి కదా! అంత ఇంఫర్మేషన్ ని పెట్టుకొని మీకు ప్రత్యేకం గా తెలియవలసిన సమాధానం ఎమీటీ? నిజంగా మనదగ్గర సమాధనం ఉంటే ఇతరులని ప్రశ్నించం కదా!
  -------------------------------------

  * మీ ఉద్దేశ్య౦ బాబా గురి౦చి అద్భుత౦ అనివ్రాసినవారికి కూడా చె౦దుతు౦దా? ఇక అసలు ప్రి౦ట్ మీడియా మొత్తానికి చె౦దుతు౦దా?*

  అందరికి చెందుతుంది. మన స్వభావాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి, పెరిగిన వాతావరణాన్ని బట్టి అభిప్రాయాలు ఎర్పరచుకొంటాం. పై మూడిటిని కలిపి అభిరుచి అని అనుకొంటె, ఆభిరుచికనుగుణంగా మనం మనకు నచ్చిన ఆర్టికల్స్, పుస్తకాలు చదవటం మొదలు పెట్టి మన నమ్మకాలను బలపరచే వాదాం వైపు మొగ్గు చూపుతాం. ఇక్కడ వాదించు కొనే వారు బాబాని ఎన్ని సార్లు కలిశారు? కలిసినా ఆయన గురించి ఎంత సమాచారం వీరికి పేపర్, మీడీయా లేక పోతే లభ్యం మౌతుంది? అందువలన ఇద్దరు వారు ఎర్పరచుకొన్న భావాల,అనుభవాల కనుగుణంగా పేపర్, మీడీయాలో వచ్చిన యింఫర్మేషన్ చదివి వాదించుకొంట్టున్నారు అని నేనంటాను. మీరు కాదనగలరా?

  ReplyDelete
 16. తాము సాయిబాబా మహిమలని నమ్మడం లేదంటారు, తాము సాయిబాబాని కేవలం గురువుగా చూస్తున్నామంటారు. సాయిబాబా మేజిక్ ట్రిక్‌లు ఎలా చేస్తాడో చూపిస్తూ నేను యూట్యూబ్‌లో పెట్టిన వీడియోలని యూట్యూబ్‌వాళ్ళు డిలీట్ చేశారు. ముహమ్మద్ ప్రవక్తకి వ్యతిరేకంగా blasphemic కార్టూన్‌లు ఉన్న వీడియోలని డిలీట్ చెయ్యలేదు. వీళ్ళు ఎవరు పక్షమో అర్థమవుతోంది. ఈ లింక్ దర్శించండి: http://vasavya.blogspot.com/2009/07/blog-post_23.html

  ReplyDelete