వీలుంటే నా నాలుగు లంకెలు ...

Sunday, August 14, 2011

స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్న వారందరకీ అభినందనలు...

64 సంవత్సరాలు నిండిన స్వతంత్ర భారతంలో రాజకీయ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్న వారందరకీ అభినందనలు...
దేశానికి/ప్రజలందరికీ ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చిందా అనేది నాకు సందేహమే!
ఇటీవల "కేబుల్స్" లో బయటపడిన విషయాలు చూస్తుంటే, ఎవరు విదేశాంగ మంత్రి, ఎవరు ఆర్ధిక మంత్రో ఆమెరికాతో మంతనాలు చెయ్యకుండా మనపాలకులు వున్నారంటే కనీసం రాజకీయ స్వాతంత్ర్యాన్నీ కోల్పోతున్నమేమోననిపిస్తుంద...

6 comments:

 1. బ్రిటిష్ బహుళజాతి కంపెనీలు ఇప్పటికీ ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఆర్థికంగా బలహీనపడిన తరువాతే బ్రిటిష్‌వాళ్ళు ఇండియా విడిచి వెళ్ళారు. కాంగ్రెస్ పోరాడి తెచ్చిన స్వాతంత్ర్యం ఏమీ లేదు. బ్రిటిష్ పాలన పోయి వాళ్ళ చెప్పు చేతల్లో పని చేసే కాంగ్రెస్ పాలన వచ్చింది.

  ReplyDelete
 2. Mr Praveen, the fact that you are able to express your thought should be enough for you to realize.
  కాంగ్రెస్ పోరాడి తెచ్చిన స్వాతంత్ర్యం ఏమీ లేదు. - I am glad that our fighters of independence are given due respect here.
  If you are blaming congress party, i guess you mean everyone who was part of the congress party during the struggle.
  hats off.

  ReplyDelete
 3. గాంధీని విమర్శిస్తూ ఎం.వి.ఆర్.శాస్త్రి గారు వ్రాసిన పుస్తకం చదివాను. 1915లో బ్రిటిష్‌వాళ్ళు చీరాల పట్టణాన్ని మునిసిపాలిటీగా ప్రకటించారు. చీరాల పట్టణంలో ఎక్కువ మంది చేనేత కార్మికులు, మునిసిపాలిటీ విధించే అధిక పన్నులు కట్టలేరు అని చీరాల పట్టణ ప్రజలు మునిసిపాలిటీ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ ఉద్యమం నడిపారు. ఆ ఉద్యమంలో కాంగ్రెస్‌లోని చిన్న స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు కానీ నాయకులెవరూ పాల్గొనలేదు. గ్రామ కరణం లేదా మునసబ్ తమ ఉద్యోగాలకి రాజీనామా చేసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అంత కంటే డబ్బున్నవాళ్ళు ఏదో ఒక ప్రయోజనం ఆశించి బ్రిటిష్‌వాళ్ళ వైపే ఉండేవాళ్ళు. కాంగ్రెస్ నాయకులు ఆ ధనిక వర్గం నుంచి వచ్చినవాళ్ళే. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సామ్రాజ్యం బలహీనపడి బ్రిటిష్‌వాళ్ళు ఇండియా విడిచి (వాళ్ళు పెట్టిన పెట్టుబడులు మాత్రం విడవకుండా) వెళ్ళిపోతే అదే స్వాతంత్ర్యం అనుకున్నారు.

  ReplyDelete
 4. మీ భావం నాకు అర్ధ్హం కాలేదు. కొంచెం వివరించగలరా


  1. మనకి స్వాతంత్రం అనవసరంగా వచ్చిందని మీ అభిప్రాయమా?
  2. అఖండ భారత దేశ స్వాతంత్ర సంగ్రామంలో తమ ధన, మాన, ప్రాణాలని లెక్కచెయ్యకుండా పాల్గొని ఎందరొ వీర వనితలు/వీరులు అమరులయ్యరు.

  మీరు చెప్పిన దాన్ని బట్టి,

  చీరాల కాంగ్రెస్ పార్టీ లో డబ్బున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దేశవ్యాప్తంగా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న కాంగ్రెస్ వాళ్ళందరు డబ్బున్న వాళ్ళు అంతేనా?
  బ్రిటిష్ వాళ్ళకి, వాళ్ళ పెట్టుబడిదారులకి తొత్తులుగా ఉండొచ్చని ప్రాణాలు లెక్క చెయ్యకుండా పోరాడి స్వాతంత్రం సంపదించారు. అంతేనా?

  ReplyDelete
 5. నేనేమీ బ్రిటిష్ పరిపాలనని జస్టిఫై చెయ్యలేదు. బ్రిటిష్‌వాళ్ళు ఇండియాని ఆక్రమించుకోకపోతే ఫ్రెంచ్‌వాళ్ళో, రష్యావాళ్ళో ఆక్రమించుకునేవాళ్ళు. బ్రిటిష్‌వాళ్ళకీ, రష్యన్లకీ మధ్య యుద్ధం జరుగుతోన్న సమయంలో రష్యావాళ్ళు ఇండియాని ఆక్రమించుకోవాలనుకున్నారు కూడా. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సామ్రాజ్యం బలహీనపడి అనుకోకుండా వచ్చిన స్వాతంత్ర్యాన్ని మేమే తెచ్చి పెట్టామని కాంగ్రెస్‌వాళ్ళు సొంత డబ్బా కొట్టుకుంటున్నారు.

  ReplyDelete
 6. బ్రిటిష్ సామ్రాజ్యం బలహీనపడి అనుకోకుండా వచ్చిన స్వాతంత్ర్యాన్ని!
  అంటే ఆయచితంగా రావటమే కానీ మన స్వాతంత్ర పోరాటం వల్ల ఏమీ రాలేదా?

  ఇక కాంగ్రెస్ అంటారా. వాళ్ళు ఎంత డబ్బా కొట్టుకున్నా చరిత్రని మార్చలేరు.

  ReplyDelete