వీలుంటే నా నాలుగు లంకెలు ...

Wednesday, November 16, 2011

అవినీతి పరుల అస్త్రం "సహజ న్యాయసూత్రం"

నాటి వార్త: "జగన్ అక్రమార్జన పై హైకోర్ట్ ప్రాదమిక విచారణకు ఆదేశం..."
     వైఎస్సార్ పార్టీ వివిధ సంధర్భాలలో ప్రకటనలు..
 1. యిది రాజకీయ కుట్రతో కూడుకున్న పిటీషన్.
 2. సోనియా ప్రోద్భలంతోనే ఈ విచారణ.
 3. సిబి‌ఐ అంటే, "కాంగ్రేస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్"
 4. న్యాయం కోసం సుప్రీం కోర్టుకు వెళ్ళడం సహజ న్యాయ సూత్రం. ఆ హక్కు మేము ఒదులుకోం. (చంద్రబాబు మాత్రం సుప్రీం కోర్టుకు వెళ్ళడం అంటే తప్పు ఒప్పుకున్నట్లే!)
 5. "2004-2009 మధ్య అక్రమాలు జరిగినట్లయితే...అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ రావు 2010 నవంబర్ వరకు ఎందుకు మౌనంగా ఉన్నారని జగన్ ప్రశ్నించారు. "నాపై వచ్చిన ఆరోపణలకు, శంకర్ రావుకు ప్రత్యక్ష సంబంధం ఏమిటి? ఆయన ప్రాథమిక హక్కులకు ఏమైనా భంగం కలిగిందా?'' అని జగన్ ప్రశ్నించారు" (చంద్రబాబు అధికారం పోయి చాలా సంవత్సరాలయింది.. మరి మీ తండ్రి హాయాంలో గోల్లు గిల్లు కుంటూ కూర్చున్నారా?)
 6. " హైకోర్టు నేరుగా తనపై సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించడం చెల్లదు. "ఆ పిటిషన్‌ను హైకోర్టు విచారణకే స్వీకరించకూడదు. నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేనప్పుడే, హైకోర్టు జోక్యం చేసుకోవాలి. హైకోర్టు నేరుగా సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 226ను దుర్వినియోగపరచడమే. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే''.  - సుప్రీంకోర్టులో జగన్ వాదన. (శంకర్రవు లేని నష్టం విజయమ్మకు చంద్రబాబు విషయంలో ఏమి నష్టం వచ్చిందో? దోచినదాంట్లో వాటాలు యివ్వలేదనా)
     తెలుగుదేశం పార్టీ:.
 1. అక్రమ సంపాదన కాదని నిరూపించుకొనే అవకాశం వచ్చింది. స్టే కోసం సుప్రీమ్ కోర్టుకు జగన్ వెళ్ళకూడదు...
 2. జగని చిప్పకూడు తినే రోజులు దగ్గకొచ్చాయి.
 3. వైఎస్‌ఆర్ మంత్రివర్గం పై కూడా సిబి‌ఐ విచారణ చేయాలి.
    కాంగ్రేస్ పార్టీ:
 1. హైకోర్టు స్పందిస్తే, సోనియా ప్రోద్భలం అనడం తగదు.
 2. చట్టం తనపని తాను చేసుకుపోతుంది.
    తెరాస పార్టీ:
 1. యిది రాజకీయ కుట్ర
 2. చోటా నాయకులు తప్ప, పోలిట్ బ్యూరో స్థాయి నేతలనుండి స్పందన లేదు.
     వామపక్షాలు, లోక్‌సత్త పార్టీలు:

 1. ఆహ్వానించదగ్గ పరిణామం.
 2. సిబిఐ రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా విచారణ చేయాలి.
నేటి వార్త: "చంద్రబాబు అక్రమార్జన పై హైకోర్ట్  సిబి‌ఐ సమగ్ర విచారణకు ఆదేశం..."
 
     వైఎస్సార్ పార్టీ ప్రకటనలు..
 1. న్యాయం గెలిసింది.. విజయమ్మ పిటీషన్ స్వీకరించింది. (జగన్ విషయంలో సహజ న్యాయసూత్రాలు పాటించలేదు)
 2. సోనియా ప్రోద్భలం ఏమిలేదు... హైకోర్టు విషయంలో సోనియా ఎలాగ కలుగజేసుకుంటుంది? (జగని విషయంలో సోనియా ప్రోద్భలంతోనే)
 3. బాబుపై సిబి‌ఐ విచారణ మొదలు పెట్టాలి. (జగన్ పై సిబి‌ఐ దాడులు ఆపాలి)
 4. న్యాయం కోసం సుప్రీం కోర్టుకు వెళ్ళడం అంటే చంద్రబాబు తప్పు ఒప్పుకున్నట్లే... (జగన వెళ్ళడం తప్పుకాదు)
     తెలుగుదేశం పార్టీ:.
 1. యిది రాజకీయ కుట్రతో కూడుకున్న పిటీషన్.(జగన్ మీద మాత్రం రాజకీయ కుట్ర కాదు)
 2. సోనియా ప్రోద్భలంతోనే ఈ విచారణ. (జగన్ విషయంలో మాత్రం కోర్టులు బగా పనిచేస్తున్నాయి)
 3. రిలయన్స్, జిఎమ్మార్, ఎల్&టి  తో పాటు వివిధ  సంస్థలు చంద్రబాబు హయాంలో లాభపడ్డాయిని ఆరోపించినప్పుడు మరి ఆ సంస్థలను పిటీషన్‌లో ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదు..  జిఎమ్మార్ వైఎస్‌ఆర్ లింకులు బయటకొస్తాయనా? 
 4. వైఎస్సార్ 26 కేసులు వేస్తే నిలబడలేదు.. యిప్పుడు కొత్తగా ఏమిలేదు...
    కాంగ్రేస్ పార్టీ:
 1. బాబు తనకు తానుగా హైకోర్టు ఆదేశాలకు ముందుగా సిబి‌ఐ విచారణకోసం కోరలసింది.
 2. హైకోర్టు స్పందిస్తే, సోనియా ప్రోద్భలం అనడం తగదు.
 3. చట్టం తనపని తాను చేసుకుపోతుంది.
    తెరాస పార్టీ:
 1. చేసిన తప్పులకు ప్రతిఫలం (జగని విషయంలో అయితే రాజకీయ కుట్ర)
 2. పోలిట్ బ్యూరో స్థాయి నేతలనుండే స్పందనలు..
 3. సుప్రీంకోర్టుకు స్టే కోసం వెళ్ళకూడదు.
 4. సుప్రీంకోర్టుకు వెళ్ళినా అక్కడేమి ఒరుగుతుందని "నమస్తే తెలంగాణ" లో పలుకులు (పై స్టేట్ మెంటుకు భిన్నంగా)
     వామపక్షాలు, లోక్‌సత్త పార్టీలు:
 1. ఆహ్వానించదగ్గ పరిణామం.
 2. సిబిఐ రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా విచారణ చేయాలి.

అంతామన మంచికేనా? లేక యిదేమైనా రాజకీయ క్రీడా?
ఏదేమైనా జగన్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తరువాత సోనియాపై జగన్ లో ఎంతో కొంత మార్పు కొట్టొచ్చినట్లు రాష్ట్ర ప్రజలు గుర్తించే స్థాయిలోనే వుంది. కాకతాళీయమో లేక ప్రోద్భలమో చెప్పలేము గాని, విజయమ్మ వేసిన పిటీషన్ తో హైకోర్టు స్పందనలో నాకు కొంత వ్యత్యాసం కనబడినది. శంకరావు వేసిన పిటీషన్‌ తో హైకోర్టు కేవలం ప్రాధమిక విచారణకు మాత్రమే ఆదేశించినది జగన్ వాదనలను విన్న తరువాత. మరి విజయమ్మ పిటీషన్‌తో ఏకంగా సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినది చంద్రబాబు వాదనలు వినకుండానే! అదే జగని విషయంలో అయితే, సుప్రీంకోర్టులో కూడా తన వాదనలు వినిపించే అవకాశం ఉపయోగించుకున్నాడు "సహజ న్యాయ సూత్రాల ప్రకారం". మరి చంద్రబాబు విషయంలో ""సహజ న్యాయ సూత్రాల" అవకాశం ఉపయోగించకూడదంట. యిది చిన్నపిల్లల తొండాట లాగలేదు?

ఆంతా మనమంచికే అనుకుందాం... ఎలుక ఎలుక రొట్టె కోసం తన్నుకొని పిల్లికి పెట్టినట్లు.. మనకేమైనా లాభం కలుగుతుందోమని చూద్దాం.. ఎందుకంటే తగిన శిక్షలు పడే వరకూ మనం ఏమి నమ్మలేము... ఏ క్షణాన ఏమవుతుందో చెప్పలేము. పుసుక్కున సిబి‌ఐ కేసులను ఉపసంహరించుకోవచ్చు సాక్షాలు లేవని చెప్పి.. నిన్న కాక మొన్న అదే జరిగింది.. కరుణానిధి ఢిల్లీ వెళ్ళి 'అమ్మ‌'  దర్శనం చేసుకొనేటప్పుడుకి సిబి‌ఐ "కనిమొళి" విషయంలో చప్పబడింది కనిమెళి బెయిల్ పిటీషన్ కి ఎదురు చెప్పమని చెప్పింది. కోర్టులు ఈ మధ్య "యాక్టివ్" గా వున్నయి కదా సరిపోయింది. కనిమెళి బెయిల్ కి సిబి‌ఐ అభ్యంతరం చెప్పనప్పటికి కోర్టు బెయిల్ నిరాకరించింది కాబట్టి సరిపోయింది లేక పోతే హాయిగా ఈపాటి ఎసి రూములో వుండేది.

చూద్దాం.. రేపు ఢిల్లీ ఎవరు వెళతారు? ఎవరి కేసులు వీగిపోతాయో!

 నర్మగర్భంగా ఒప్పుకొనేది ఏమంటే..

తన మీద ఆరోపణలు వచ్చినపప్పుడు నిరూపించుకోవలసింది పోయి, కనీసం ఆ ఆరోపణలపై స్పందించకుండా, వారిమీద కేసులేదు, వీరిమీద కేసులేదు నామీదే కేసులు వేసారంటే దానర్థం ఏమిటి? వేరే ఏమైనా చెప్పాలా!


చట్టం తనపని తాను చేసుకుపోతుందిని నమ్మలంటే...వీరందరికి శిక్షలు పడాలి!
సిబి‌&ఐ విచారణలో వున్న ప్రముఖులు..

 1. గనులపేరుతో దోపిడి - గాలి
 2. వ్యాపారం/అధికారం పేరుతో దోపిడి - జగన్
 3. హైటెక్ పేరుతో దోపిడి - చంద్రబాబు
 4. దొంగ లెక్కలతో దోపిడి - రామలింగరాజు
 యింక మిగిలిన నాయకులపై కూడా విచారణ జరగాలి.. మచ్చుగా నాకు బాగా గుర్తున్న కొందరు..
 1. మతం పేరుతో దోపిడి - బ్రదర్ అనిల్ కుమార్
 2. మూఢ విశ్వాసాలతో దోపిడి - సత్యసాయి ట్రస్ట్
 3. స్నేహం పేరుతో దోపిడి -  కెవిపి రామచంద్ర రావు
 4. భూకబ్జాలతో దోపిడి -  సత్తిబాబు
 5. కృత్రమ వర్షాలని దోపిడి - రఘువీరా
 6. నీటి డ్యాముల పేరుతో దోపిడి -పొన్నాల
 7. విధ్యుత్పోత్తి పేరుతో దోపిడి - రాజగోపాల్
 8. సెంటిమెంటు పేరుతో దోపిడి - కెసిఆర్
 9. బ్లాక్‌మెయిలింగ్‌ లతో దోపిడి- కెటీఆర్
 10. సంస్కృతి పేరుతో దోపిడి - కవిత
 11.  మీడియా పేరుతో దోపిడి - రామోజీ రావు
 12. సినిమాల పేరుతో దోపిడి - మగధీర, దూకుడు నిర్మాతలు (యిప్పుడిప్పుడు బయటకొసున్నయి ఏ సినిమామీద ఎంత సంపాదించినది - ఐటి దాడులు చేస్తేగాని అస్సలు లెక్కలు బయటకు రావు)
యిప్పుడు చెప్పండి దోపిడీకి ఏదీ అనర్హం కానిదే కదా? దోపిడి చేయడానికి ప్ర్రాంతీయ భేదాలు లేవు, కుల మతాలసలే లేవు...


3 comments:

 1. కెసి‌ఆర్ అంత డబ్బున్నవాడు కాదు. కెసి‌ఆర్ తండ్రి భూస్వామే కానీ అతని తండ్రి కాలంలోనే అతని కుటుంబానికి చెందిన ఆస్తులు పోయాయి. దళితులని కులాంతర వివాహం చేసుకున్న ఒక అగ్రకుల పేదల కుటుంబంలో పుట్టి ముఖ్యమంత్రైన తరువాత అతని కొడుక్కి వేల కోట్ల ఆస్తిని కట్టబెట్టిన రాజశేఖరరెడ్డి, డబ్బై వేల కోట్లకి రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంక్‌కి తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరినీ మించిన దొంగలు రాష్ట్రంలో ఎక్కడున్నారు?

  ReplyDelete
 2. వాసవ్యగారూ, ఏమై అనుకోకుండా మీ బ్లాగుని కుడలిలో కుడా పెట్తండి. మాలిక అంతా కెలుకూడ్‌ బ్లాగుల మయం అవడం మీఊలాన కనైపించడం .ఏదు

  ReplyDelete
 3. గాలి జనార్ధనరెడ్డి గురించి వ్రాసారు కాబట్టి చెపుతున్నాను.
  >>>>>
  మీ ఊరు పక్కన కొండలో ఇనుప ఖనిజం ఉందని పొరపాటున కూడా చెప్పకు
  గాలి జనార్ధన రెడ్డి వచ్చి ఆ కొండని డైనమైట్లతో తవ్వుతాడు
  ఆ కొండ మీద ఉన్న ఎలుగు బంట్లు, అడవి పందులు అన్నీ కొండ కిందకి దిగి వచ్చి
  మీ ఊరి పంట పొలాల మీద పడి పాడు చేస్తాయి.
  >>>>>

  ReplyDelete