వీలుంటే నా నాలుగు లంకెలు ...

Friday, September 28, 2012

ప్రత్యేక తెలంగాణ వాద మితృలకు ఒక సూటి ప్రశ్న...

మిత్రపక్షాలు కాదన్నా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారే మన కాంగ్రేస్ ప్రధాని, అటువంటిది ప్రధాన ప్రతిపక్షమైన భాజప సపోర్ట్ యిస్తున్నా తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టని ఈ కాంగ్రేస్ పార్టీ ఢిల్లీ పెద్దల గుమ్మం దగ్గర  చెప్పు లా  పడివున్న కెసిఆర్ మీకు నాయకుడా లేక తెలంగాణ ద్రోహా?

కొడుకు కెటిఆర్ ని బొత్స దగ్గరకి ఎందుకు పంపినట్లు? అతను ఆంథ్రప్రాంతానికి సంబంధించిన వాడు కాదా? ఏమా రహస్య ఒప్పందాలు. యిది ఏమైనా చీకటి వ్యాపార సంబంధాలా?

గమనిక:  కెసిఆర్ అభిమానులు మరియు అతని ఉధ్యమాన్ని సపోర్ట్ చేసినవారు మాత్రమే స్పందించగలరని మనవి. ఎందుకంటే కెసిఆర్ ని వ్యతిరేకించే వాళ్ళు తలో కామెంటు వేసినా గూగుల్ బ్లాగ్ ఓవర్‌లోడ్ అవుతుందేమో...

18 comments:

 1. మీరు చెప్పాలనుకునేది ఏమిటి? కెసి‌ఆర్‌ని వ్యతిరేకించేవాళ్ళు కోటి మంది ఉంటారు, అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రం ఏ కొద్ది మందో ఉంటారనా?

  ReplyDelete
  Replies
  1. కుందేలుకి మూడుకాళ్ళు ఉంటాయనుకోవడంలో తప్పు లేదు కానీ నాలుగో కాలిని ఎవరూ చూపించలేరనుకుంటే అలా అనుకునేవాళ్ళని ఎవరూ మార్చలేరు.

   Delete
  2. అంటే, తెలుగులో ఈ టపాని చదవ గలిగే వారిలో కెసిఆర్ ని సమర్థించే వారే ఎక్కువని నీ ప్రగాడ విశ్వాసాన్ని ఎవరు మాత్రం ఖండించ గలరు చెప్పు ప్రవీణ్!

   Delete
  3. తెలుగులో రెండు వేల బ్లాగ్‌లు ఉన్నాయి. వాటిలో ఐదు వందల బ్లాగ్‌లు కూకట్‌పల్లి వాసులవే. కూకట్‌పల్లి వాసులు ఏ ప్రాంతం నుంచి వలస వెళ్ళినవాళ్ళో తెలియదా? నేను ఉండేది వైజాగ్ నక్కవానిపాలెంలో. సీతమ్మధార వార్డ్‌లో పది వేల మంది వోటర్లు ఉన్నారనుకుందాం. ఒకవేళ నేను ఇక్కడ సమైక్యాంధ్ర నినాదంతో కార్పొరేటర్‌గా పోటీ చేస్తే నాకు వంద వోట్లు కూడా రావు. అప్పుడు సీతమ్మధార-నక్కవానిపాలెంలలో వంద మంది సమైక్యవాదులు కూడా లేరని ఒప్పుకుంటారా? అటువంటప్పుడు కూకట్‌పల్లి బ్లాగర్‌లు కెసి‌ఆర్‌ని తిట్టే తిట్లు చూసి తెలంగాణాలో తెలంగాణావాదులు ఎవరో కొద్ది మంది మాత్రమే ఉన్నారని ఎందుకు అనుకోవాలి?

   Delete
  4. వాసవ్య గారికి సానుభూతులు, దొరికిపోయారు. బాలయ్య కంటి చూపుతో చంపితే, ప్రవీణ్ పనికిమాలిన కామెంట్లతో చంపుతాడు.

   Delete
  5. Topic divert chEyaDamlO nIku nuvvE sAti.. naa Tapaa udhEsaaniki nee comments ki emaina sambabdam vunda... last li commedy ga rasina dani gurinchi kaakunda asala vishayam gurunchi comment cheyyu

   Delete
  6. He is a retard, he can't be better than that.

   Delete
  7. సంబంధం లేకపోవడం కాదు. కెసి‌ఆర్‌ని ద్వేషించేవాళ్ళు ఇంత మంది ఉన్నారని లెక్కలు చూపించినది మీరే కదా.

   Delete
 2. మీరు తెలంగాణా ఉద్యమం కెసిఆర్ గుత్తా అనుకుంటే పప్పులో కాలే. కెసిఆర్ అనే ఒకానొక వ్యక్తి & తెరాస అనే ఒకానొక పార్టీ మనుగడపై తెలంగాణా ఆధారపడలేదు.

  మోసాలు నయవంచనలు మాకు కొత్త కాదు. నిన్న చంద్రబాబు, రేపు కెసిఆర్ కావచ్చు. రాష్ట్ర సాధన లక్ష్యానికి అడ్డు పడిన ప్రతి ఒక్కన్ని పాతర వేయడం ఖాయం. తెలంగాణా ప్రజల ఆకాంక్షను గౌరవించినన్నాళ్ళూ ఆదరించిన ప్రజలే ద్రోహం చేస్తే ఆగ్రహంతో బొంద పెట్టడం ఖాయం.

  కెసిఆర్ పై మీరెన్ని నిందలు వేసినా మాకు అనవసరం. ఆ ముసుగులో ఉద్యమాన్ని తక్కువ అంచనా వేయడం మీకే హానికరం.

  ReplyDelete
  Replies
  1. నేను ప్రత్యేక తెలంగాణాకి ఏమి వ్యతిరేకంగా వ్రాయక పోయినా, కెసిఆర్‌ను విమర్శించిన ప్రతివాడు తెలంగాణా ద్రోహే అనే నానుడి నిజమనిపించారు..

   "మీకే హానికరం" అన్నారు.. ఠక్కున మొన్న కొదండరామ్ గారు మంత్రి శ్రీధర్ బాబు తండ్రికి పట్టిన గతే (నక్జల్స్ చే చంపబడ్డారు) అతనికి పడుతుందన్నారు అది గుర్తొచ్చింది.. కొంపతీసి మీరు అన్నంత పని చేస్తారా మాకే హానికరం అన్నారు?

   Delete
  2. ఆ మీరిలా ఫికర్ అవ్వకుర్రి.
   నేను పుట్టకముందు నుంచి ఇలా నోరుచేసుకునే నెట్టుకొస్తున్నారు. ఏమంటే, 60ఏళ్ళనుంచి చేస్తుడం అంటారు. పోరాటాల కేన్సర్ గడ్డ అంట. ఇదేం పోరాటమో, ఇన్స్టాల్‌మెంట్ల పోరాటం, తింటూనే ఏడుస్తుంటారు. :)

   Delete
  3. మావోయిస్ట్‌లు శ్రీపాదరావుని చంపింది "Annihilation of class enemy" సూత్రాన్ని అనుసరించి. కోదండరాం శ్రీధర్‌బాబుని బెదిరించినది అతన్ని తెలంగాణావాదులే చంపుతారని. తెలంగాణాలో పుట్టి కోస్తా నాయకుల మోచేతి నీళ్ళు తాగేవాడు చచ్చినవాడితోనే సమానం కదా. కనుక కోదండరాం అన్న దాంట్లో తప్పేమీ లేదు.

   Delete
  4. పోలీసులు, ఆజాద్ లాంటి దేశద్రోహ నక్సలైట్లను పిచ్చి కుక్కలను కాల్చినట్టు కాల్చి చంపేది కూడా శాంతిభద్రతలకై ప్రజలను కాపాడటానికి అన్న భాధ్యత కోసం. నీలాంటి వడ్డోళ్ళ జడ్జిమెంట్లు ఎవరికీ అవసరం లేదు.

   Delete
  5. "ఉద్యమాన్ని తక్కువ అంచనా వేయడం మీకే హానికరం"
   ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు బెదురుతారనుకునే మీ మూర్ఖత్వం హాస్యాస్పదం. మాకు హాని చేసి, హాయిగా బ్రతగ్గలమనే అనుకుంటున్నారా? చేసి చూడండి.

   Delete
 3. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
  Replies
  1. This comment has been removed by a blog administrator.

   Delete
 4. వాసవ్య గారు, మీ బ్లాగ్‌లోని వ్యాఖ్యలకి కూడా స్క్రీన్‌షాట్‌లు తీసి పెడితే బాగుంటుంది కదా: http://praveen.greenhost.net.in/the-foul-language-permitted-by-parakala-prabh

  ReplyDelete