వీలుంటే నా నాలుగు లంకెలు ...

Wednesday, August 14, 2013

కమ్యునిజ 'తెలంగాణ వాద' మేధావి వర్గం ముసుగులు తొలగిపోతున్నాయ్..

ఈ రోజు టివి 9 న్యూస్ వాచ్ లో 'రాజకీయ విశ్లేషకుడు' గా ప్రొ॥ చక్రపాణి
కమ్యునిజ 'తెలంగాణ వాద' మేధావి వర్గం యొక్క ముసుగులు క్రమేనా  తొలగిపోతున్నాయి.  నిన్న 'కోదండరాం' నేడు,   'రాజకీయ విశ్లేషకుడు' గా ప్రొ॥ చక్రపాణి

కోస్తా ఆంధ్రలో జరుగుతున్న ఉధ్యమాన్ని ఉక్కుపాదం తొ ఆనిచివేయలేదేమిటని డి.జి.పి నిలదీసిన కోదండరాం. నేడు టివి 9 లో ప్రొ॥ చక్రపాణి , సీమాంద్రలో జరుగుతున్న ప్రభుత్వ ఉధ్యోగుల సమ్మెపై మాట్లాడుతూ, ఈ సమ్మె వల్ల ఏమీ లాభం ఉండదు. మీకు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు, మీరు రిటైర్ అయినా సరే మీకు ఫించను సెటెల్ అవ్వదు, మీకు కెరీర్ లో రి మార్క్ ఉండిపోతుందని ఉధ్యోగులను భయపెట్టాలని ప్రయత్నించడం చూస్తుంటే, వీరు ఏ వర్గ స్వభావంతో పనిచేస్తున్నారో అర్థం అవుతుంది. అధికారంలో వున్న పెట్టుబడీ దారులు కూడా సరిగ్గా యిలానే మాట్లాడతారు ఎవరైనా సమ్మె చేస్తే! మరి యిదే ఉపోద్ఘాతం తెలంగాణ ఉధ్యోగులకు 'సకల జనుల సమ్మెలో" మీరు ఎందుకు వివరించలేదు?

జనాలకు మరీ అంత మతి మరుపు వుందనుకుంటే ఎట్లా? తెలంగాణ ఉధ్యమాలలో అసలు అరాచకాలు జరగలేదు, శాంతియుతంగా జరిగాయి అంటే, మీరు మేధావులు ఏంచెప్పినా నిజమే చెప్పుతారని జనులు నమ్ముతారని మీరు భ్రమ్మల్లో వున్నట్లే...  ట్యాంక్ బండపై శ్రీశ్రీ విగ్రహం కూల్చినా తప్పు పట్టని మీరుఇందరాగాంధీ విగ్రహాలు ధ్వంసం ని మీరు చాలా తీవ్రంగా ఖండించడం, తెలంగాణలో ఒక్క ఇందిరా గాంధి విగ్రహమూ కూల్చనట్ట్లు మీరు నటించడం చూస్తుంటే మీకు వున్నది అతితెలివని తెలుస్తుంది.  గత నాలుగు సంవత్సరాలలో "తార్నాక" సెంటర్లో "పెట్ర్లోల్" బంకులను, చుట్టు ప్రక్కల ప్రవేటు కార్లను ఎన్ని సార్లు ధ్వంసం చేశారో ఎవరికి తెలియదు? అంతెందుకు, హైదరబాద్ లో షాంపింగ్ మాల్స్ కి వున్న నెట్స్ (వల)ను తీసే ధైర్యం ఎవరికైనా వుందా? అంటే యింకా భయం భయం గానే వుంది, తెలంగాణా వాదులతో ఏమవుతుందో నని.

నేను ఫ్రొవెసర్ ని మీరు నేను చెప్పేది వినాలి, మీరు చెప్పేది నేను విన్నక్కర్లేదు అని వితండ వాదం తో,  మితి మీరిన అహంభావంతో, అక్కడ వున్నవారినందరినీ శాసించాలనుకోవడం, విశ్లేషకుడిగా తన పరిది మీరి మాట్లాడటం,  ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఈ రోజు టివి9 లో మాట్లాడిన తీరు కడు గర్హనీయం.

మోత్తానికి ఈ మెధావి వర్గం అంతా తెలంగాణా పెట్టుబడీ దారి వర్గానికి "కూరలో కర్వేపాకు" మాత్రమే! సామన్య ప్రజలకు వీరు ఎంత అన్యాయంచేశారో ఎప్పుడు తెలుస్తుందో.. చిన్న చిన్న రాష్ట్రాలతో ఏదేదో సాధించేయ్యొచ్చనే భ్రమలో వీరు "ఫాసిస్ట్" గా మారుతున్నారు.. ఒక కె.సి.అర్  మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నారు.

చిన్న రాష్ట్రాలతో దోపీడి వర్గానికే అనుకూలం అని తెలిసి వచ్చే రోజు ముందు ముందు వుంది!!

No comments:

Post a Comment